Game Changer: ఎప్పుడెప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కి వస్తుందా అని మెగా ఫాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇండియా మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో గేమ్ ఛేంజర్ కూడా ఒకటి. ఇక ఆ ఎదురుచూపులకు సమాధానంగా జనవరి 10న సంక్రాంతి రేసులో ఈ సినిమా దిగుతుంది అని తెలిసి ఫాన్స్ ఎగిరి గంతేశారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ ఛేంజర్. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. ఇక స్టార్ నటుడు ఎస్ జె సూర్య విలన్ గా కనిపిస్తుండగా.. శ్రీకాంత్, జయరాం తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు అంచనాలను మరింత పెంచేశాయి.
Prabhas: వారికి క్షమాపణలు చెప్పిన ప్రభాస్.. వీడియో వైరల్
ముఖ్యంగా ఈ మధ్య రిలీజ్ అయిన నానా హైరానా సాంగ్ అయితే గ్లోబల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఫ్రెష్ సాంగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సాంగ్ తరువాత మరో మాస్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. గత మూడు రోజుల నుంచి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ మూడో సాంగ్ గురించి సోషల్ మీడియాలో హైప్ పెంచుతూనే ఉన్నాడు. సాంగ్ సూపర్ ఉంటుంది అని, దీనికి ఫ్యాన్స్ థియేటర్ లో గంతులు వేయడం ఖాయమని చెప్పుకుంటూ వచ్చారు.
ఇక థమన్ చెప్పిన మూడో సాంగ్ ధోప్.. ధోప్ ప్రోమోను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హ్యాపీ హ్యాపీ లైఫ్ కు మైక్రో మంత్ర ధోప్.. అంటూ సాగిన ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. శంకర్ ప్రతి సినిమాలో కూడా ఒక ఇంగ్లీష్ లిరిక్స్ తో కూడిన సాంగ్ ఉంటుంది. అందులో హీరోయిన్ కూడా అలంటి హెయిర్ కట్ తోనే కనిపిస్తూ ఉంటుంది.
Salman Khan: ఆ సినిమాలో ఫ్రీగా నటించిన సల్మాన్ ఖాన్.. భాయ్‌ది ఎంత పెద్ద మనసు!
ర్యాప్ మోడల్స్ గా హీరోయిన్స్ తీర్చిదిద్దడంలో శంకర్ సిద్ధహస్తుడు. రోబో, స్నేహితుడు, ఐ.. ఇలా అన్ని సినిమాల్లో ఒక సాంగ్ లో హీరోయిన్ హాలీవుడ్ మోడల్ గా కనిపిస్తుంది. ఇందులో కూడా కియారా డిఫరెంట్ హెయిర్ స్టైల్ లో కనిపించి కనివిందు చేసింది. ఇక చరణ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక ఈ సాంగ్ ను సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో తమన్, రోషిని, పృథ్వీ శృతి రంజని పాడారు. ఈ ఫుల్ సాంగ్ 21 న అమెరికాలో రిలీజ్ అవుతుండగా.. డిసెంబర్ 22 న తెలుగులో రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. ప్రోమోతోనే సాంగ్ పై అంచనాలను పెంచేసిన శంకర్.. ఫుల్ సాంగ్ తో ఎలాంటి టాక్ ను అందుకుంటాడో చూడాలి.