Malavika Mohanan: ఎంత పెద్ద స్టార్ హీరోయిన్స్ అయినా కూడా అప్పుడప్పుడు ఇండస్ట్రీలో కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కునే ఉంటారు. దాదాపు అందరు హీరోయిన్స్ కెరీర్‌లో ఇలాంటి ఒక ఘటన జరిగే ఉంటుంది. అయినా వాటి గురించి ఓపెన్‌గా చెప్పుకోవడానికి చాలామంది ముందుకు రారు. కానీ కొందరు మాత్రం తమకు ఇండస్ట్రీలో జరిగే అన్యాయాల గురించి బోల్డ్‌గా, ఓపెన్‌గా మాట్లాడేస్తారు. తాజాగా అందులో ప్రభాస్ బ్యూటీ మాళవికా మోహనన్ కూడా యాడ్ అయ్యింది. ప్రస్తుతం తమిళ, మలయాళం, తెలుగు అని తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలతో బిజీగా ఉన్న మాళవికా.. ఇండస్ట్రీలో నటీమణులకు జరుగుతున్న అతిపెద్ద అన్యాయం గురించి తాజాగా ఓపెన్ అయ్యింది.
చాలా తేడా
ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు సమానంగా కష్టపడినా కూడా హీరోయిన్లకు దక్కే రెమ్యునరేషన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుందని ఇప్పటికే చాలామంది నటీమణులు ఓపెన్‌గా కామెంట్స్ చేశారు. కమర్షియల్ సినిమా అయినా, లేడీ ఓరియెంటెడ్ చిత్రమైనా కూడా హీరోయిన్స్‌కు ఒకే విధంగా రెమ్యునరేషన్స్ ఇస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రెమ్యునరేషన్ విషయంలోనే కాదు.. తమకు దక్కే గౌరవం విషయంలో కూడా హీరోయిన్స్‌కు అన్యాయం జరుగుతుందని ఘాటు కామెంట్స్ చేసింది మాళవికా మోహనన్ (Malavika Mohanan). తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ‘రాజా సాబ్’ బ్యూటీ ఇండస్ట్రీలో హీరోలకు, హీరోయిన్లకు మధ్య చూపిస్తున్న వ్యత్యాసం గురించి మాట్లాడింది.
అంతా ఫేక్
‘‘ఇండస్ట్రీలో కొందరు హీరోలు.. హీరోయిన్లను గౌరవిస్తున్నట్టుగా నటిస్తూ ఉంటారు. సరైన సమయంలో మాస్క్ వేసుకొని ఇండస్ట్రీలో తమ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఇలా చేస్తుంటారు. అదంతా ఫేక్. ఈ గత అయిదేళ్లలో బయటికి ఒకలా, లోపల మరొకలా నటిస్తున్న చాలామంది వ్యక్తులను నేను కలిశాను. వాళ్లంతా కెమెరా ఆఫ్ చేయగానే వేరే వ్యక్తుల్లా మారిపోతారు. వీళ్లకు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో బాగా తెలుసు. ఆడవారి సమస్యల గురించి వాళ్లు ఆలోచిస్తున్నట్టుగా నటించడం అంతా అబద్ధం’’ అంటూ తను హీరోయిన్‌గా అడుగుపెట్టినప్పటి నుండి ఇలాంటి అనుభవాలు చాలానే ఎదుర్కున్నానని చెప్పుకొచ్చింది మాళవికా మోహనన్.
Also Read: విమానాల్లో తిరిగే స్థాయి నుండి రిక్షాఆలో ఎక్కే పరిస్థితి.. నా జీవితం అక్కడే అలవాటయ్యింది.!
ఇది అంతమవ్వాలి
‘‘ఆడ, మగ అనే తేడా ఇండస్ట్రీలో చాలానే ఉంది. ఇండస్ట్రీలో హీరోయిన్లను ఒకలాగా, హీరోలను ఒకలాగా చూసే ఆలోచనా విధానం మారాలి. అసలు ఇలాంటి యాటిట్యూడ్ ఎప్పుడు అంతమవుతుందా అని ఎదురుచూస్తున్నాను’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది మాళవికా మోహనన్. ఇప్పుడిప్పుడే కెరీర్‌లో స్పీడ్ అందుకుంటున్న ఒక యంగ్ హీరోయిన్.. ఇలాంటి ఓపెన్ కామెంట్స్ చేయడం ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తోంది. ఇండస్ట్రీలో హీరోలకు, హీరోయిన్లకు రెమ్యునరేషన్ విషయంలోనే కాదు.. మరెన్నో విషయాల్లో కూడా తేడా చూపిస్తారని తెలిసినా.. చాలామంది దీని గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. కానీ మాళవికా అలా కాదని తేలిపోయింది. మాళవికా మాట్లాడింది కరెక్ట్ పాయింట్ అని, ఇప్పటికైనా హీరోయిన్లను గౌరవించాలని, వారి సమస్యలను కూడా పట్టించుకోవాలని తన ఫ్యాన్స్ తనకు మద్దతు తెలిపారు.