Manchu Family Issues: మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆఖరికి మీడియాపై కూడా దాడి జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగక తప్పలేదు. మోహన్ బాబు స్వయంగా ఇంటి నుండి బయటికి వచ్చి మీడియాపై దాడి చేశారు. అంతే కాకుండా తన గన్‌ను చూపిస్తూ అందరినీ బెదిరించారు. దీంతో పోలీసులు ఆయన గన్‌ను సీజ్ చేశారు. ప్రస్తుతం మంచు మనోజ్ గేట్లు బద్దలుకొట్టుకొని ఇంట్లోకి వెళ్లిపోయాడు. తనతో పాటు తన భార్య భూమా మౌనిక కూడా గేట్ లోపలికి వెళ్లారు. కానీ వారి ఇంటి లోపలికి రానివ్వకుండా మోహన్ బాబు ఏ మాత్రం సిద్ధంగా లేరని తెలుస్తోంది.
గన్ సీజ్
మోహన్ బాబు (Mohan Babu) ఇంటి వద్ద ఉద్రిక్తతను అక్కడే ఉండి కవర్ చేస్తున్న మీడియాపై తన కోపాన్ని చూపించారు మోహన్ బాబు. అంతే కాకుండా వారిని అక్కడి నుండి తరిమేయడానికి గన్ చూపిస్తూ బెదిరించారు. దీంతో వేరే దారి లేక మోహన్ బాబు గన్‌ను సీజ్ చేశారు పోలీసులు. ఆయన దగ్గర నుండి లెసెన్స్‌డ్ గన్ అయినా కూడా అలా అందరినీ బెదిరించడానికి ఉపయోగించడంతో పోలీసులు దానిని సీజ్ చేసినట్టు తెలుస్తోంది. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు గన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద పరిస్థితి కంట్రోల్‌లో లేకుండా పోయింది.
Also Read: మీడియాపై మోహన్ బాబు దౌర్జన్యం.. కెమేరాలు పగలగొట్టిన సెక్యూరిటీ
కంట్రోల్ చేయడం కోసం
సమాచారాన్ని అందుకున్న పోలీసులు.. పరిస్థితిని కంట్రోల్ చేయాలని అనుకున్నారు. అంతలోపే తానే పరిస్థితిని కంట్రోల్ చేయడం కోసం గన్‌తో బెదిరింపులకు పాల్పడ్డారు మోహన్ బాబు. పోలీసులు రంగంలోకి దిగినా కూడా ఈ కుటుంబం గొడవ ఆగిపోతుందనే పరిస్థితి కనిపించడం లేదు. ఇది కేవలం మంచు ఫ్యామిలీలో చిన్న ఆస్తి వివాదంగా మొదలయ్యి ఇప్పుడు ప్రేక్షకులంతా చర్చించుకునేంతలా మారింది. అంతే కాకుండా పోలీసులు కూడా ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడం కోసం మోహన్ బాబు ఇంటి వద్దకు చేరుకోవాల్సి వచ్చింది. అసలు తర్వాత ఈ కుటుంబంలో ఏం జరుగుతుంది? ఈ గొడవ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందని తెలియడం లేదని ఇండస్ట్రీ పెద్దలు సైతం అనుకోవడం మొదలుపెట్టారు.
ఈ కష్టం తీర్చేదెవరు?
మామూలుగా ఏ కుటుంబానికి కష్టం వచ్చినా తమ దగ్గరకు వచ్చి చెప్పుకుంటారని ఒకప్పుడు మంచు ఫ్యామిలీ చాలా గర్వంగా చెప్పుకుంది. అలాంటిది ఇప్పుడు ఈ కుటుంబంలోనే తీర్చలేని సమస్యలు వచ్చాయి. దీంతో ఇప్పుడు వీరు ఈ సమస్యను తీర్చడానికి ఎవరి దగ్గరకు వెళ్తారా అని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ చిన్న చిన్న గొడవలే అని, అన్నీ సరిదిద్దుకుంటాయని చెప్పిన మంచు విష్ణు సైతం బౌన్సర్లతో తన తమ్ముడు మంచు మనోజ్ (Manchu Manoj) ఇంటి లోపలికి రానివ్వకుండా ఆపేలా చేశాడు. మొత్తానికి ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందా, ఎప్పటివరకు ఆగుతుందా అని అందరిలో ఆసక్తి నెలకొంది.