BigTV English

Pawan Kalyan: కొడుకు స్కూల్ అడ్మిషన్ కోసం పవన్ పాట్లు.. అయ్యయ్యో అందుకేనా?

Pawan Kalyan: కొడుకు స్కూల్ అడ్మిషన్ కోసం పవన్ పాట్లు.. అయ్యయ్యో అందుకేనా?

Pawan Kalyan: సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం రాజకీయ వ్యవహారాలు చూసుకుంటూ మరోవైపు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇలా ఈ బిజీ షెడ్యూల్లోను తన కుటుంబం కోసం కూడా పవన్ కళ్యాణ్ కొంత సమయం కేటాయిస్తూ తన బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా కాస్త విరామం దొరకడంతో ఈయన హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagath Singh) సినిమా షూటింగ్ పనులలో పాల్గొంటున్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.


ఇక్రిశాట్ ఇంటర్నేషనల్ స్కూల్..

నెలరోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అన్ని సన్నివేశాలను షూట్ చేయబోతున్నట్ల సమాచారం. ప్రస్తుతం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్  తాజాగా హైదరాబాద్లోని పటాన్ చెరువు లోకి ఇక్రిశాట్ ఇంటర్నేషనల్ స్కూల్ (ICRISAT International School)కి వెళ్లారని తెలుస్తుంది. ఈయన తన కుమార్తె అంజనాతో కలిసి ఈ స్కూల్ కి వెళ్లారని సమాచారం. ప్రస్తుతం ఈ పాఠశాల ఆవరణంలో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ తన కొడుకును ఇక్కడే చదివించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకే తన కొడుకు స్కూల్ అడ్మిషన్ కోసమే వెళ్లారని తెలుస్తోంది.


అగ్నిప్రమాదం వల్లే..

ఇకపోతే మార్క్ శంకర్ తన తల్లి అన్నా లెజినోవా , తన సోదరి అంజనాతో కలిసి సింగపూర్ లోనే ఉంటూ అక్కడే చదువుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే సింగపూర్ లో వీరి వ్యాపార వ్యవహారాలను కూడా చూసుకుంటూ  ఉంటున్నారు. అయితే ఇటీవల మార్క్ శంకర్(Mark Shankar) చదువుతున్న పాఠశాలలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం(Fire Accident) చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా అగ్నిప్రమాదంలో చిన్నారి కాళ్లు చేతులకు గాయాలు కావటం పొగ పీల్చడం వల్ల స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ఇలా ఈ ప్రమాదం నుంచి మార్క్ శంకర్ క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇలా తనకు దూరంగా ఉండటం వల్ల అనుకోని ప్రమాదాలు జరిగితే ఎంతో ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ తన భార్య బిడ్డలను హైదరాబాద్ లోనే ఉంచాలని నిర్ణయం తీసుకున్నారని అందుకే తన కొడుకు చదువుల కోసం ఇక్రిసాట్ స్కూల్లో అడ్మిషన్ చేయించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఒకవైపు కుటుంబ బాధ్యతలతో పాటు మరోవైపు సినిమాలను అలాగే రాజకీయ వ్యవహారాలతో పవన్ కళ్యాణ్ క్షణం తీరిక లేకుండా ఎంతో బిజీగా గడుపుతున్నారు. సినిమాల విషయానికి వస్తే ఈయన నటించిన హరిహర వీరమల్లు సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ఓజి కూడా షూటింగ్ పనులను పూర్తి  చేసుకుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×