Pant Mad Celebrations: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో ఇవాళ కీలక మ్యాచ్ జరిగింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య 70 వ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ల క్నో భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20వ ఓవర్లలోనే… మూడు వికెట్లు నష్టపోయి 227 పరుగులు చేసింది. అయితే ఇందులో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మెరిశాడు.
Also Read: Arshdeep Singh Private Chat: అర్ష్‌దీప్ ప్రైవేట్ చాట్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ప్రీతి జింటా
సెంచరీ తో దుమ్ము లేపిన రిషబ్ పంత్ ( Pant Mad Celebrations)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ( Indian Premier League 2025 Tournament ) అత్యధిక ధర పలికిన రిషబ్ పంత్… ఈ టోర్నమెంట్ మొత్తం విఫలమైన సంగతి తెలిసిందే. కానీ ఈ టోర్నమెంట్లో లక్నో ఆడిన చివరి మ్యాచ్లో మాత్రం దుమ్ము లేపాడు. అద్భుతమైన సెంచరీ తో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చుక్కలు చూపించాడు. 61 బంతుల్లో 118 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు రిషబ్ పంత్. ఇందులో ఎనిమిది సిక్సర్లతో పాటు 11 బౌండరీలు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన తర్వాత… రిషబ్ పంత్ చేసిన సందడి అంతా ఇంతా కాదు.
సెంచరీ చేసిన అనంతరం గ్రౌండ్ లోనే సర్కస్ చేశాడు రిషబ్ పంత్. చిన్నపిల్లడిలా… గాల్లోకి ఎగురుతూ.. గిర్రని తిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ రెచ్చిపోయి సెంచరీ చేయడంతో… లక్నో ఓనర్ సంజీవ్ ఫుల్ ఖుషి లో ఉన్నట్లు తెలుస్తోంది. 27 కోట్లు పెట్టి కొన్నందుకు…. చివరికి మ్యాచ్లో సెంచరీ చేశాడని.. లక్నో ఓనర్ సంజీవ్ తెగ సంబరపడిపోతున్నారు. ఇదే ఆట ముందు నుంచి ఆడితే… లక్నో జట్టు ఫైనల్ దాకా వెళ్లే దానికి కూడా.. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
ఆర్సిబి బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో ప్లేయర్లు
ఇవాల్టి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చాలా కీలకమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిస్తే.. టాప్ 2 లోకి బెంగళూరు వెళ్లే ఛాన్స్ వచ్చేది. ఇలాంటి నేపథ్యంలో లక్నోతో మ్యాచ్ పడింది. లక్నో చిన్న టీమే… రిషబ్ పంత్ ఫామ్ లో లేడు.. రెచ్చిపోదామనుకున్నారు. కానీ అలాంటి సమయంలోనే మొదటి వికెట్ కు వచ్చిన రిషబ్ పంత్ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ తో రాణించాడు రిషబ్ పంత్. అలాగే లక్నో ఓపెనర్ మార్ష్.. మరోసారి మెరిశాడు. 37 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు మార్ష్. దీంతో భారీ స్కోర్ చేసింది లక్నో సూపర్ జెంట్స్.
Also Read: Shashank Singh: ప్రీతీ జింటాకు శశాంక్ బిగ్ ట్రీట్.. 2 రోజుల ముందే చెప్పి మరీ
#RishabhPant Spider-Man celebration after his 100* 😂🔥🔥#LSGvsRCB #RCBvsLSG #TATAIPL #ViratKohli #playbold pic.twitter.com/8wb5VyvUuz
— Abhiram (@Wolf83343) May 27, 2025