Manchu Manoj: మంచు ఫ్యామిలీలో గత కొన్నిరోజులుగా జరుగుతున్న గొడవల గురించే ప్రేక్షకులు ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారు. మంచు విష్ణు, మనోజ్.. ఇద్దరూ పోలీసుల ముందు నేరస్తులుగా నిలబడాల్సి వచ్చింది. దీంతో తమ కుటుంబంలో జరుగుతున్న గొడవలను తాము పరిష్కరించుకుంటామని, త్వరలోనే కలిసిపోతామని మంచు ఫ్యామిలీ ప్రకటించింది. కానీ అలా జరగలేదు. తాజాగా మంచు విష్ణు.. మనోజ్ ఇంటికి వెళ్లి చేసిన పనికి మనోజ్ మళ్లీ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.
నిజం బయటపడాలి
మంచు మనోజ్ తాజాగా పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మంచు విష్ణుపై మరొక ఫిర్యాదు చేశాడు. ఆపై అసలు ఏం జరిగిందనే విషయాన్ని చెప్తూ ఒక ప్రెస్ స్టేట్‌మెంట్ విడుదల చేశాడు. ‘‘డిసెంబర్ 14న మా కుటుంబ సేఫ్టీ విషయంలో జరిగిన ఒక సంఘటన నన్ను చాలా బాధపెట్టడంతో పాటు డిస్టర్బ్ చేసింది కూడా. ఈ సంఘటన నన్ను చాలా కదిలించింది కాబట్టి నిజం బయటపడి మాకు న్యాయం దక్కేలా చేసుకోవడం నా బాధ్యత అని నేను అనుకుంటున్నాను. నిన్న నేను షూటింగ్‌కు వెళ్లాను. నా భార్య.. నా కొడుకు స్కూల్ ఈవెంట్‌కు వెళ్లింది. అదే సమయంలో నా తలల్లి పుట్టినరోజు అనే కారణంతో మంచు విష్ణు మా ఇంట్లోకి వచ్చాడు’’ అని ఈ స్టేట్‌మెంట్‌లో చెప్పుకొచ్చాడు మంచు మనోజ్.
Also Read: మెగా మామ ఇంటికి బన్నీ.. గొడవలకు స్వస్తి..కానీ?
ప్రాణాలు పోయేవి
‘‘మంచు విష్ణు.. తన అనుచరులు అయిన రాజ్ కొండూరు, కిరణ్, విజయ్ రెడ్డి, మరికొందరు బౌన్సర్లతో కలిసి మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించాలనే కారణంతో ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. కానీ వారు కావాలనే విధ్వంసం సృష్టించడానికి వచ్చారు. వాళ్లు మా ఇంట్లోని జెనరేటర్లను ట్యాంపర్ చేశారు. అవి పనిచేయకుండా ఉండడంతో కోసం చక్కెర కలిపిన డీజిల్‌ను పోశారు. అర్థరాత్రి జెనరేటర్లు పనిచేయడం ఆగిపోయింది. ఇంట్లో మా అమ్మ, నా 9 ఏళ్ల కూతురితో పాటు ఊరి నుండి వచ్చి అత్త, మామ కూడా ఉన్నారు. జెనరేటర్స్ దగ్గరే వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి. ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉంది. దాని వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగి మా ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంది’’ అని బయటపెట్టాడు మనోజ్.
అందరినీ బెదిరించాడు
‘‘మంచు విష్ణు (Manchu Vishnu) ఇంటి నుండి వెళ్లిపోతూ మా ఇంట్లో పనిచేసే వ్యక్తిని బయటికి పంపించేశాడు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని మా కోచ్‌ను బెదిరించాడు. ఇది అనుకోకుండా జరిగింది కాదు. కావాలనే మమ్మల్ని భయపెట్టడానికి చేశారు. చట్టపరంగా వార్నింగ్ ఇచ్చినా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మా అమ్మ పుట్టినరోజును సంతోషంగా సెలబ్రేట్ చేసుకోకుండా ఇలా జరగడం చాలా బాధాకరం. ఇప్పుడు మా కుటుంబమంతా ప్రాణహాని ఉందనే భయంలో జీవిస్తున్నాం. అందుకే అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది బయటికి చెప్పడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి హాని జరగదని అనుకుటున్నాను’’ అని మంచు మనోజ్ (Manchu Manoj) స్టేట్‌మెంట్ ఇచ్చాడు.