Sreeleela: శ్రీలీల ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది. అంతేకాదు స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా చాన్సల్ అందుకుంటూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది. కెరియర్ పరంగా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కూడా పర్సనల్ విషయాల్లో కూడా ఆమె అందరి నోట్లో నాలుతూ ఉంటుంది. మొన్నటివరకు నెట్టింట సినిమాలతో హాట్ టాపిక్ అయిన ఈమె ఇప్పుడు డేటింగ్ లో ఉందంటూ వార్తలతో వార్తల్లో నిలుస్తుంది. కార్తిక్ ఆర్యన్ తో ఆమె క్లోజ్ గా ఉంటూ కనిపించడం కొత్త రూమర్లకు తెరతీసింది. అయితే, ఆమె సినిమాల కంటే ముందుగా చేసిన ఓ నిర్ణయం నెట్టింట హాట్ డిస్కషన్ గా మారింది.. ఇదంతా పక్కన పెడితే ఈమె మనసు చాలా మంచిది.. ఈ అమ్మడు చేస్తున్న ఓ మంచి పని బయటపడ్డది దాంతో మరోసారి శ్రీలీల పై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఈ అమ్మడు అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈమె స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించింది. అయితే అందులో కొన్ని సినిమాలు మంచి రెస్పాన్స్ అందుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం డిజాస్టర్ గా మారాయి. ప్రస్తుతం ఏమే తన సినిమాలు విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకొని సినిమాలను చేసేందుకు రెడీ అవుతుంది. ఇటీవల బాలీవుడ్ లో అడుగుపెట్టిన శ్రీలీలకు సినిమాల సంగతి పక్కన పెడితే రూమర్స్ మాత్రం బాగానే వినిపిస్తున్నాయి. తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.
Also Read:రామ్ గోపాల్ వర్మతో ఆ తప్పు చేశాను..అషూ పశ్చాత్తాపం?
తన వయస్సు కేవలం 23 ఏళ్లు మాత్రమే అయినప్పటికీ, ఇద్దరు వికలాంగ బాలురను దత్తత తీసుకుని వారి భవిష్యత్తుకు అండగా నిలిచింది. గురు, శోభిత అనే చిన్నారులను ఓ అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకున్నట్లు సమాచారం.. ఈ వార్త మళ్లీ హాట్ టాపిక్ అవుతుంది. శ్రీలీల గొప్ప మనసు పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో ఆమె సన్నిహితంగా ఉంటోందనే ప్రచారం ఊపందుకుంది. ఇటీవల కార్తిక్ ఇంట్లో జరిగిన ఓ ఫ్యామిలీ సెలబ్రేషన్ లో ఈమె పాల్గొన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.. అందులో శ్రీలీల డ్యాన్స్ చేస్తూ అందరితో బాగా కలిసిపోయింది. ఇక కార్తిక్ తల్లి మాలా తివారీ ఇచ్చిన స్టేట్ మెంట్ ఈ రూమర్లకు బలం చేకూర్చింది. ఒక ఇంటర్వ్యూలో కార్తిక్ భవిష్యత్తు భార్య గురించి ప్రశ్నించగా మా ఇంటికి డాక్టర్ కోడలు అవుతుందని చెప్పడంతో ఈ వార్తలు నిజమే అని అర్థమైంది. ఈ వార్తల పై శ్రీలీల మాత్రం స్పందించలేదు కానీ ఈ వార్త బాలీవుడ్ లో అటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇక శ్రీలీల కెరీర్ విషయానికొస్తే. టాలీవుడ్ తో పాటుగా, బాలివుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తుంది.