PM Modi with Shaktikanta Das: మోదీ సర్కార్ నిర్ణయాలు ఎవరికీ అంతుబట్టవు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరూ ఊహించరు. కానీ, నమ్మినవారికి మాత్రం అందలం ఎక్కిస్తారనే ప్రచారమైతే పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా ఉంది. ప్రస్తుతం అదే జరిగింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌కు కీలక పదవి లభించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై షాకయ్యారు కొందరు ఐఏఎస్‌లు.
కేంద్రం నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఆమోదించడం ఆపై ఉత్తర్వులు జారీ కావడం చకచకా జరిగింది. శక్తికాంత దాస్ భాద్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన నియమాకం అమల్లోకి రానుంది.
అయితే ప్రధానమంత్రి టర్మ్ వరకు అయ్యేవరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ పదవిలో శక్తికాంతదాస్ కొనసాగుతారన్నది ప్రభుత్వ ప్రకటన. ప్రస్తుతం పీకే మిశ్రా 2019 సెప్టెబర్ 11 నుంచి ప్రధానమంత్రికి పర్సనల్ సెక్రటరీగా ఉన్న విషయం తెల్సిందే.
ఆర్బీఐ గవర్నర్‌గా ఆరేళ్ల పాటు పనిచేశారు శక్తికాంత దాస్. గతేడాది ఆయన డిసెంబర్‌లో పదవీ విరమణ చేశారు. అయితే ఆయనకు మరో టర్న్ ఆ పదవిని పొడిగిస్తారని చాలామంది భావించారు. చివరకు ఆర్బీఐ 26వ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయింది.
ALSO READ: విమానంలో కేంద్రమంత్రికి విరిగిపోయిన సీటు
2018లో ఊర్జిత్ పటేల్ అకస్మాత్ముగా రాజీనామా చేయడంలో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు 67 ఏళ్ల శక్తి కాంత దాస్. 1980 తమిళనాడు ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన, ఢిల్లీలోని సెయిట్ స్టీఫెన్ కాలేజీలో మాస్టర్ డిగ్రీ చేశారు. బర్మింగ్‌హామ్ యూనివర్శిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.
సరిగ్గా తొమ్మిదేళ్ల కిందట అంటే 2016 నవంబర్‌లో పెద్దనోట్లను రద్దు చేసినప్పుడు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా వ్యవహరించారు శక్తికాంతదాస్. ఆ తర్వాత 2017 జూలై 1 నుంచి ప్రత్యక్ష పన్నులు జీఎస్‌టీలో విలీనం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఆ మరుసటి ఏడాది డిసెంబర్ 12, 2018న ఆయన గవర్నర్‌గా నియమితులయ్యారు. 2021లో ఆర్బీఐ గవర్నర్‌గా ఆయన పదవికాలం ముగిసింది. మరో మూడేళ్లు ఆయన పదవీకాలాన్ని పొడిగించారు కేంద్రం. ఈసారి మాత్రం పొడిగింపు ఇవ్వలేదు.
అనూహ్యంగా ఆర్‌బిఐ మాజీ గవర్నర్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి శక్తికాంత దాస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఐఎంఎఫ్(IMF), జీ-20(G20), బ్రిక్స్(BRICS), సార్క్(SAARC) వంటి అనేక అంతర్జాతీయ వేదికల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు శక్తికాంత దాస్.
ఒడిషాకు చెందిన దాస్
శక్తికాంత దాస్ ఒడిషాకు చెందినవారు. భువనేశ్వర్‌లో జన్మించిన ఆయన, డెమోన్‌స్ట్రేషన్ మల్టీపర్పస్ స్కూల్‌లో విద్యను అభ్యసించారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో బీఏ, మాస్టర్స్ డిగ్రీపొందారు. ఆ తర్వాత సివిల్ సర్వెంట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలలో ఆర్థిక, పన్నులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు మొదలైన రంగాలలో ముఖ్యమైన పదవులను నిర్వహించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆయన 8 కేంద్ర బడ్జెట్ల తయారీలో ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉన్నారు.
శ్యామ్ దారిలో శక్తికాంత దాస్
కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పలువురు ఐఏఎస్‌లు షాకయ్యారు. నార్మల్‌గా అయితే మాజీ ఆర్బీఐ గవర్నర్లు ఇప్పటివరకు ఇలాంటి పదవులు అందుకున్న సందర్భం లేదు. తొలిసారి శక్తికాంత దాస్ ప్రధాని ముఖ్యకార్యదర్శిగా ఛాన్స్ వరించింది. విచిత్రం ఏంటంటే మోదీ నమ్మిన ఐఏఎస్ అధికారుల్లో ఆయనది కీలకపాత్ర. అందుకే ఆయన ఏరికోరి కార్యదర్శిగా నియమించుకున్నారని అంటున్నారు. అన్నట్లు కాంగ్రెస్ హయాంలో శ్యామ్ పెట్రోడాకు కీలకంగా కొనసాగారు. మోదీ హయాంలో శక్తికాంత దాస్ వంతైంది. ఇద్దరూ ఒడిషా రాష్ట్రానికి చెందినవారే.