March Box-office : 2025 ఫిబ్రవరి తెలుగు సినిమాకు ఏమాత్రం కలిసి రాలేదు. ఈ నెలలో రిలీజ్ అయిన చాలా సినిమాలు నిరాశ పరిచాయి. ఒక్క సినిమా కూడా కనీసం ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిపించలేకపోయింది ఒక్క ‘తండేల్’ (Thandel) తప్ప. అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా నటించిన నటించిన ‘తండేల్’ ఫిబ్రవరిలో టాలీవుడ్ అందుకున్న ఏకైక హిట్ చిత్రం. ఇందులో సాయి పల్లవి (Sai Pallavi) మ్యాజిక్, మత్య్సకారుల కథ, నాగ చైతన్య నటన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం హైలెట్ గా నిలిచాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చి పెట్టింది. ఈ మూవీ తప్ప ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఒక్క మూవీ కూడా హిట్ కాలేదు.
మార్చిపై మూవీ లవర్స్ ఫోకస్
టాలీవుడ్ ప్రేక్షకులు డిజాస్టర్ గా మిగిలిన ఫిబ్రవరి సంగతి వదిలేసి, ఇప్పుడు మార్చిపై దృష్టి పెట్టారు. ఈ నెలలో చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా ఉండడం విశేషం. కిరణ్ అబ్బవరం ‘దిల్రుబా’, నాని నిర్మాణంలో వస్తున్న ‘కోర్ట్’, నితిన్ ‘రాబిన్ హుడ్’, మోస్ట్ అవైటింగ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ఈ నెలలోనే రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అదే సమయంలో ఈ నెలలో వరుస డబ్బింగ్ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి.
విక్కీ కౌశల్ సూపర్ హిట్ చిత్రం ‘చావా’ మార్చి 7న తెలుగులో విడుదల అవుతోంది. అలాగే జాన్ అబ్రహం నటించిన ‘ది డిప్లొమాట్’, సునీల్ శెట్టి ‘కేసరి వీర్’, సల్మాన్ ఖాన్ ‘సికందర్’ మార్చిలో హిందీలో రిలీజ్ అవుతున్నాయి. ఇవన్నీ కేవలం హిందీ సినిమాలు మాత్రమే. ఇంకా తమిళ నటుడు విక్రమ్ ‘వీర దీర సూరన్: పార్ట్ 2’, జివి ప్రకాష్ కుమార్ ‘కింగ్‌స్టన్’ చిత్రాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ కూడా మార్చిలో విడుదల కానుంది. మార్చి నెలలో డబ్బింగ్ చిత్రాల రూపంలో టాలీవుడ్‌కు గట్టి పోటీ ఉండబోతోంది. మార్చి 7నే ఏకంగా 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మార్చి 14, 21, 28 తేదీలలో రెండేసి సినిమాలు తెరపైకి రానున్నాయి. అయితే మార్చి 28 న మాత్రం రెండు సినిమాలు ‘రాబిన్ హుడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్స్ ఆఫీసు బరిలోకి దిగబోతుండడం ఆసక్తికరంగా మారింది. మరి మార్చ్ బాక్స్ ఆఫీసు బరిలో గెలిచేది ఎవరో చూడాలి.
మార్చిలో రిలీజ్ కానున్న తెలుగు సినిమాల లిస్ట్
మార్చి 7 – 14 డేస్
మార్చి 14 – దిల్రూబా అండ్ కోర్ట్
మార్చి 21 – పెళ్లి కాని ప్రసాద్
మార్చి 28 – రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్
మార్చిలో రానున్న డబ్బింగ్ సినిమాలు
మార్చిలో రానున్న డబ్బింగ్ సినిమాలు
మార్చి 7 – ఛావా (హిందీ)
మార్చి 7 – జివి ప్రకాష్ కుమార్ కింగ్‌స్టన్ (తమిళం),
మార్చి 7 – ఆలంబన (తమిళం)
మార్చి 7 – ద డిప్లొమాట్ (హిందీ)
మార్చి 14 – కేసరి వీర్ (హిందీ)
మార్చి 21 – పింటు కి పప్పి (హిందీ)
మార్చి 27 – వీర ధీర సూరన్: పార్ట్ 2
మార్చి 30 – సికందర్ (హిందీ)