Master Bhanu Prakash..సాధారణంగా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టులు ఎప్పటికప్పుడు తమకంటూ ఒక ఉణికి చాటుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తొమ్మిదేళ్ల వయసులోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టి గత ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రేక్షకులను అలరిస్తున్న మాస్టర్ భాను ప్రకాష్ (Master Bhanu Prakash)కూడా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్2(KGF 2) వంటి పాన్ ఇండియా సినిమాలలో అవకాశాన్ని దక్కించుకున్న భాను ప్రకాష్.. ఇటీవల విడుదలైన ‘తండేల్’ సినిమాలో కూడా తన అద్భుతమైన నటనతో మెప్పించారు. ప్రస్తుతం ఏడవ క్లాస్ చదువుతున్న ఈయన తాజాగా బిగ్ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్టీఆర్( Jr .NTR)గురించి చేసిన కామెంట్లు అభిమానులలో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక భాను ప్రకాష్ జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పిన మాటలు విని ఎన్టీఆర్ అభిమానులు ఫిదా అయిపోతూ..భాను ప్రకాష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ పై భాను ప్రకాష్ కామెంట్స్..
ఇంటర్వ్యూలో భాగంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కదా.. మీరు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఏ హీరో నుంచి ఏ క్వాలిటీ తీసుకుంటారు అని ప్రశ్నించగా.. భాను ప్రకాష్ మాట్లాడుతూ ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి చెప్పిన మాటలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎన్టీఆర్ గురించి భాను ప్రకాష్ మాట్లాడుతూ.. “జూనియర్ ఎన్టీఆర్ చాలా డెడికేషన్ తో పని చేస్తారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ నుంచి విడుదల చేసిన బియాండ్ స్టోరీ చూశాం కదా.. ఆయన ఎంత డెడికేటెడ్ గా పనిచేశారో.. ఈ ఒక్క సీన్ చాలు ఆయన సినిమా కోసం ఎంతలా కష్టపడతారో అని చెప్పడానికి.. ఒక పాత్రకి ఎంత కావాలో దానికి రెట్టింపు న్యాయం చేస్తారు. ముఖ్యంగా ఆయన బేస్ వాయిస్ కి నేను ఫిదా అయ్యాను. ఏ టీజర్ కి వాయిస్ ఇచ్చినా సరే ఆ టీజర్ సూపర్ సక్సెస్ అవుతుంది. ఆయన వాయిస్ వింటూ ఉంటే అలా డెప్త్ లోకి వెళ్ళిపోతాము” అంటూ జూనియర్ ఎన్టీఆర్ గురించి చాలా గొప్పగా చెప్పి ఎన్టీఆర్ అభిమానులకి సంతోషాన్ని కలిగించారు భాను ప్రకాష్. ప్రస్తుతం భాను ప్రకాష్ జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని చెప్పవచ్చు.
భాను ప్రకాష్ కెరియర్..
భాను ప్రకాష్ కెరియర్ విషయానికి వస్తే ఈయన తండ్రికి డైరెక్షన్ చేయాలని ఆసక్తి ఎక్కువగా ఉండేదట. అలా రెండు మూడు షార్ట్ ఫిలిమ్స్ కి దర్శకత్వం కూడా వహించారట. ఆయన షార్ట్ ఫిలిం కి దర్శకత్వం వహిస్తున్న సమయంలో అందులో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కావాలని అందులో తన కొడుకు అయితే బాగుంటాడని, కొడుకుతోనే నటింపచేశారట . అలా ఆ షార్ట్ ఫిలిం తో క్లిక్ అయిన భాను ప్రకాష్ ఏకంగా సినిమాలలో అవకాశాన్ని దక్కించుకున్నాడు. 13 సంవత్సరాల వయసున్న భాను ప్రకాష్ ఇప్పటికే దాదాపు 20 కి పైగా చిత్రాలలో నటించారు. డైలాగ్ చెప్పడం మొదలుపెడితే అనర్గళంగా చెబుతూ వయసుకు మించిన పరిణితితో నటనకు సంబంధించి అన్ని ఫార్మాట్లలో ప్రావీణ్యం పొందారు. ముఖ్యంగా కే జి ఎఫ్ 2 సినిమాలో నటించి ప్రపంచవ్యాప్తంగా భారీ పాపులారిటీ అందుకున్న భాను ప్రకాష్ ఇటీవల తండేల్ సినిమాలో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక సినిమాలే కాకుండా షార్ట్ ఫిలిమ్స్, సీరియల్స్ , యాడ్స్, టీవీ షోస్, నాటకాలు , పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నాడు.