IRCTC AI Ticket Booking | ట్రైన్ టికెట్లు ఈజీగా ఆన్ లైన్‌లో బుకింగ్ కోసం ఐఆర్‌సిటిసి (భారతీయ రైల్వే) కొత్త సిస్టమ్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్రక్రియను తత్కాల్ టికెట్ బుకింగ్ తో అనుసంధానం చేశారు. ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా టికెట్ బుక్ చేసుకోవడానికి ఈ కొత్త ఫీచర్స్ ఎంతో ఉపయోగపడతాయని ఇండియన్ రైల్వే తెలిపింది. ఈ కొత్త సిస్టం ఫిబ్రవరి 15, 2025 నుంచే అమలులోకి వచ్చింది.
ఈ కొత్త సిస్టం రాకతో టికెట్ బుకింగ్ సమయంలో ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ క్రాష్ కావడం, ఫ్రాడ్ టికెట్ బుకింగ్ చేయడం వంటివి నియంత్రణలోకి వస్తాయని, టికెట్లు మరింత త్వరగా బుకింగ్ చేసుకోవడానికి ప్రయాణికులకు వీలుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ ప్రయాణాల కోసం తత్కాల్ టికెట్ల బుకింగ్ పైనే ఆధారపడే ప్రయాణికులకు ఇది శుభవార్తే.
టికెట్ బుకింగ్ కోసం కృత్రిమ మేధ (ఏఐ)
ఇప్పుడు ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్, మొబైల్ యాప్ రెండూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో అనుసంధానం చేయబడ్డాయి. ఈ అప్ గ్రేడ్ లో ప్రయాణికులు టికెట్ల బుకింగ్ చాలా ఫాస్ట్ గా చేసుకోగలరు.
ఐఆర్‌సిటిసి లో ఏఐ టెక్నాలజీ రావడంతో ఇవే లాభాలు..
టికెట్ల బుకింగ్ , రిజర్వేషన్ రద్దు లాంటి లావాదేవీలకు మోసపూరిత లేదా అనుమానిత లావాదేవీలను ఏఐ గుర్తించగలదు.
అనవసర ట్రాఫిక్ ని నిలుపుదల చేసి వెబ్ సైట్, యాప్ ని క్రాష్ కాకుండా కాపాడుతుంది. వెబ్ సైట్ పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది.
ఎమర్జెన్సీ సమయంలో నిజమైన ప్రయాణికులను గుర్తించి వారికి టికెట్లు అందుబాటులోకి ఉండే విధంగా చేస్తుంది.
Read Also: కోడికి టికెట్ తియ్యాలి, ఐస్ క్రీమ్ తినకూడదు.. ఈ ఫన్నీ రైల్ రూల్స్ తెలుసా?
టికెట్ల బుకింగ్ కోసం ఎక్కువ ట్రాఫిక్ ఉన్న సమయంలో ముఖ్యంగా తత్కాల్ టికెట్ల బుకింగ్ విషయంలో వెబ్ సైట్ క్రాష్ ని చాలా వరకు ఏఐ తగ్గించగలదు.
ఐఆర్ సిటిసి తత్కాల్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి?
తత్కాల్ ట్రైన్ బుకింగ్ కోసం ఈ స్టెప్స్ పాటించండి.
ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ తెరవండి
అందులో మీ ఐఆర్‌సిటిసి అకౌంట్ తో లాగిన్ చేయండి.
మీకు కావాల్సిన ట్రైన్ కోసం సెర్చ్ చేయండి. అంటే ట్రైన్ నెంబర్ లేదా మీరు ప్రయాణం చేయాలనుకునే మార్గాన్ని ఎంటర్ చేయండి.
తత్కాల్ ఆప్షన్ ఎంచుకోండి. అందుకోసం కోటాలో తత్కాల్ బుకింగ్ ని సెలెక్ట్ చేయండి.
ప్యాసింజర్ వివరాలను ఫిల్ చేయండి.
డెబిట్ కార్డు, యుపిఐ, క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ఆప్షన్లలో ఏదైనా ఒకటి ఎంచుకొని టికెట్ ధరను చెల్లించండి.
మీ ఈ మెయిల్, మొబైల్ నెంబర్ కు టికెట్ కన్‌ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
అయితే ఈ ప్రక్రియంలో ఏఐని అనుసంధానం చేయగా ఈ మార్పులు వచ్చాయి. ఏఐ తత్కాల్ బుకింగ్ విధానంలో ఫ్రాడ్ బుకింగ్స్ ను ఏఐ గుర్తించి వాటిని నిలువరిస్తుంది.
క్యాప్చా ని సింపుల్ చేసి యూజర్లకు త్వరగా లాగిన్ చేయిస్తుంది.
పేమెంట్ ని చాలా ఫాస్ట్ గా కానిచ్చేస్తుంది.
అందుబాటులో ఉన్న సీట్ వివరాలను త్వరగా ప్రయాణికులకు తెలియజేస్తుంది.
తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో యూజర్లు ఫాస్ట్ ఇంటర్నెట్ కలిగి ఉంటే ప్రక్రియ త్వరగా సజావుగా సాగిపోతుంది.