Masthan Sai – Lavanya: కొన్నాళ్ల క్రితం యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య ప్రేమ, పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక కొన్నిరోజుల నుండి ఈ వ్యవహారం వార్తల్లోకి రాకపోయేసరికి కాస్త సర్దుకుందని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఒక కొత్త పేరు, కొత్త సమస్యతో ఈ విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. మస్తాన్ సాయి అనే వ్యక్తిపై లావణ్య ఫిర్యాదు చేసింది. తను తప్పు ఏం లేదంటూ మస్తాన్ సాయి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. కానీ అదే సమయంలో మస్తాన్ డ్రగ్స్ తీసుకున్నాడంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మరొక మలుపు తిరిగింది. తాజాగా మస్తాన్ సాయిపై పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ టెస్ట్‌లో తనకు పాజిటివ్ అని తేలింది
డ్రగ్స్ పాజిటివ్
మస్తాన్ సాయి డ్రగ్స్ తీసుకునేవాడని, వేరేవాళ్లకు సప్లై కూడా చేసేవాడని, దానికి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మస్తాన్ సాయిపై ఇటీవల డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు పోలీసులు. అందులో తనకు పాజిటివ్ అని తేలిందని సమాచారం. ముందుగా న్యూడ్ వీడియోల కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. తనతో పాటు తన సహచరుడు కాజాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య చేసిన ఫిర్యాదు తర్వాత మస్తాన్ సాయితో పాటు కాజాకు కూడా డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు పోలీసులు. ఇందులో ఈ ఇద్దరికీ పాజిటివ్ వచ్చిందని తెలుస్తోంది.
డ్రగ్స్ కేసు కూడా
న్యూడ్ వీడియోల కేసుతో పాటు ప్రస్తుతం మస్తాన్ సాయిపై డ్రగ్స్ కేసును కూడా ఫైల్ చేశారు పోలీసులు. మస్తాన్ సాయిపై పాటు కాజాపై కూడా NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మస్తాన్ సాయి, కాజా.. ఇద్దరూ పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఇప్పటికే న్యూడ్ వీడియోల కేసుగా మొదలయిన ఈ విషయం.. ఇప్పుడు డ్రగ్స్ కోణాన్ని బయటికి వచ్చేలా చేసింది. ఇంకా ముందు ముందు ఈ కేసు నుండి మరెన్ని కొత్త విషయాలు బయటపడతాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మస్తాన్ సాయి ఫోన్.. పోలీసుల అదుపులో ఉండగా అందులో ఉన్న ఫోటోలు, వీడియోలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వీడియోల్లో ఉన్న మహిళల సమాచారం గురించి ప్రయత్నిస్తున్నారు.
Also Read: విజయ్ నాకు నచ్చడు… పొలిటికల్ ఎంట్రీ తర్వాత ఒక్కసారిగా ప్లేట్ మార్చిన త్రిష
ఇప్పుడు బయటపడింది
గతేడాది జూన్ 3న డ్రగ్స్ కోసం విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన తనిఖీల్లో మస్తాన్ సాయి దాదాపుగా పోలీసుల చేతికి చిక్కాడు. కానీ అదే సమయంలో వెంటనే వారి కళ్లు గప్పి తప్పించుకున్నాడు. అప్పటినుండి మస్తాన్ సాయిపై పోలీసుల ఫోకస్ ఉంది. ఎట్టకేలకు గుంటూరులో అతడు పోలీసుల చేతికి చిక్కాడు. కొన్నాళ్ల క్రితం హీరో రాజ్ తరుణ్.. లావణ్య అనే అమ్మాయిని మోసం చేశాడంటూ వచ్చిన వార్తల్లో కూడా మస్తాన్ సాయి అనే పేరు పదేపదే వినిపించింది. కానీ అతడు ఎవరు అనే పూర్తి సమాచారం అప్పుడు బయటపడలేదు. మొత్తానికి న్యూడ్ వీడియోలు, డ్రగ్స్ కేసు వల్ల అసలు మస్తాన్ సాయి ఎవరు, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనే విషయాలు మెల్లమెల్లగా బయటికొస్తున్నాయి.
డ్రగ్స్ టెస్ట్ లో మస్తాన్ సాయికి పాజిటివ్#DrugsCase #MastanSai #RajTarun #lavanya #bigtvcinema pic.twitter.com/cdWxXdjjl3
— BIG TV Cinema (@BigtvCinema) February 5, 2025