BigTV English

Mazaka Movie : ఛాంబర్‌కెక్కిన పంచాయితీ… మజాకా వల్ల లాభం ఎవరికి..?

Mazaka Movie : ఛాంబర్‌కెక్కిన పంచాయితీ… మజాకా వల్ల లాభం ఎవరికి..?

Mazaka Movie : మజాకా మూవీ మజానిస్తుంది అంటూ చెప్పుకున్నారు మూవీ టీం. ప్రమోషన్స్ టైంలో దాదాపు అందరూ ఇదే డైలాగ్ చెప్పారు. అయితే… రిలీజ్ తర్వాత అలాంటి మజా ఎక్కడా కనిపించలేదు. పైగా దాదాపు అన్ని ప్రాంతాల్లో నష్టాలే వస్తున్నాయని బయ్యర్లు వాపోతున్నారు. అంతే కాదు… ఫిల్మ్ ఛాంబర్ వరకు వచ్చారట బయ్యర్లు. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం…


సందీప్ కిషన్ – రీతు వర్మ, రావు రమేష్ – అన్షు ముఖ్య పాత్రలతో రొమాంటిక్ కామెడీ జానర్ లో వచ్చిన సినిమా ఈ మజాకా. ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై అనిల్ సుంకర, రాజేష్ దండ కలిసి దాదాపు 25 కోట్లు పెట్టి ఈ సినిమాను నిర్మించారు.

చిరంజీవి వరకు వెళ్లిన స్టోరీ కావడం, రైటర్ అండ్ డైరెక్టర్ – ప్రసన్న కుమార్ బెజవాడ – త్రినాథ రావు నక్కిన కలిసి గతంలో చేసిన ధమాకా మూవీ వల్ల మజాకా మంచి బిజినెస్ అయింది. గతంలో వీరి ధమాకా మూవీకి 100 కోట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మజాకాకు కూడా అలాంటి ఫలితం వస్తుందని అందరూ ఆశించారు. అందుకే మజాకా మూవీకి మంచి బిజినెస్ జరిగిందని చెప్పొచ్చు.


మొత్తంగా వరల్డ్ వైడ్‌గా ఈ మూవీకి కేవలం థియేట్రికల్ బిజినెసే 11.50 కోట్ల వరకు అయింది. అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వలంటే… 12 కోట్లు రాబట్టాలి. మొత్తంగా కలెక్షన్లు చూస్తే దాదాపు 11 కోట్ల వరకు వచ్చాయంట. అంటే ఫైనల్ గా చూస్తే దాదాపు కోటి రూపాయల వరకు బయ్యర్లకు లాస్ అని తెలుస్తుంది.

ఫైనల్ లెక్కలు కాకుండా… ప్రాంతాల వారిగా చూస్తే… బయ్యర్లు భారీగా నష్టపోయారట. కొన్ని ప్రాంతాల్లో బయ్యర్లు దాదాపు కోటి నుంచి 50 లక్షల వరకు నష్టపోతే… మరి కొన్ని ప్రాంతాల్లో కనీసం పెట్టిన ఖర్చు కూడా రిటర్న్ రాలేదని వాపోతున్నారు.

ఛాంబర్ వద్ద మజాకా పంచాయితీ…

దీంతో కొంత మంది బయ్యర్లు… ఫిల్మ్ ఛాంబర్ మెట్లు ఎక్కారట. నిర్మాతల వల్ల తాము చాలా నష్టపోయామని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారట. రైట్స్ కి చెల్లించిన డబ్బులు కాదు.. కనీసం పెట్టిన ఖర్చులు కూడా రాలేని పరిస్థితి ఉందని ఆ బయ్యర్లు అంటున్నట్టు టాక్.

అనిల్ సుంకర కూడా నష్టాన్ని భరిస్తారా..?

మజాకా మూవీ నిర్మాణంలో ఎకె ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర కూడా ఉన్నాడు. దీంతో బయ్యర్లకు వచ్చిన నష్టాలను భరించడంలో ఆయన స్థానం ఎంత వరకు ఉంటుంది అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. బయ్యర్లుకు న్యాయం చేయాలని ఫిల్మ్ ఛాంబర్ చెబితే… రాజేష్ దండ ఒక్కడే ఆ నష్టాన్ని భరిస్తాడా..? లేదా అనిల్ సుంకర కూడా భరిస్తాడా ..? అనేది చూడాలి.

మజాకా వల్ల ఎవరికి లాభం..?

ఇప్పుడు బయ్యర్లు తమను కాపాడండి అంటూ ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించిన నేపథ్యంలో మజాకా వల్ల లాభపొందింది ఎవరు..? అనే క్వశ్చన్ తెరపైకి వచ్చింది. సినిమాను దాదాపు 25 కోట్లతో నిర్మించారు. నాన్ థియేట్రికల్ రైట్స్ జీ నెట్‌వర్క్‌కి ఇచ్చారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×