Mega 157: తెలుగు వారి ప్రతీ పండగను స్టార్ హీరోలు సెంటిమెంట్‌గా ఫీల్ అవుతారు. అందుకే వారి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ గానీ, ప్రారంభోత్సవాలు గానీ, పూజా కార్యక్రమాలు గానీ.. అవే రోజుల్లో జరిగితే బాగుంటుందని అనుకుంటారు. అలా టాలీవుడ్ హీరోలు స్పెషల్‌గా ఫీల్ అయ్యే పండగల్లో ఉగాది కూడా ఒకటి. ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ అసలు ఫ్లాప్సే లేని దర్శకుడిగా గుర్తింపు సాధించిన అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక వీరి కాంబినేషన్‌కు సంబంధించిన సినిమా ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
రూటు మార్చిన చిరు
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి హిట్ వచ్చి చాలారోజులే అయ్యింది. పైగా ఆయన నటించిన చివరి సినిమా ‘భోళా శంకర్’ ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద డిశాస్టర్‌గా నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్ చేయడం వల్లే ప్రేక్షకుల దగ్గర నుండి ఆ రియాక్షన్ వచ్చిందని గ్రహించిన చిరు.. ఇకపై రీమేక్స్ వద్దని ఒరిజినల్ స్టోరీలపై దృష్టిపెట్టారు. అదే క్రమంలో యంగ్ డైరెక్టర్ వశిష్టతో ‘విశ్వంభర’ అనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. కానీ పలు కారణాల వల్ల ఆ సినిమా కూడా ఆలస్యమవుతూ వస్తోంది. అందుకే దాని షూటింగ్ పూర్తయిన తర్వాత దానిని పక్కన పెట్టేసి అనిల్ రావిపూడితో సినిమాపై ఫోకస్ పెట్టారు. దీనిని మరింత ఆలస్యం చేయకూడదు అనే ఉద్దేశ్యంతో పూజా కార్యక్రమాలు కూడా పూర్తిచేశారు.
సెన్సేషనల్ డైరెక్టర్
డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఇప్పటికే రికార్డ్ సాధించాడు. తను దర్శకుడిగా ఇప్పటివరకు 8 సినిమాలు తెరకెక్కించగా.. ఆ 8 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అంటే ఇప్పటివరకు తన కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా లేదు. అందుకే అలాంటి దర్శకుడితో చిరంజీవి సినిమా అనగానే అది పక్కా హిట్ అని మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక అనిల్ రావిపూడికి ఇప్పటికే వెంకటేశ్ లాంటి స్టార్ హీరోను హ్యాండిల్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి తనపై మరింత నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే అనిల్ తనకు మూడు సూపర్ హిట్ సినిమాలు ఇవ్వడంతో ఈ పూజా కార్యక్రమానికి వెంకటేశ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యి క్లాప్ కొట్టారు.
Also Read: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీపై పిల్ కొట్టివేసిన హైకోర్టు..
ఎందరో సెలబ్రిటీలు
చిరంజీవి (Chiranjeevi), వెంకటేశ్ (Venkatesh) లాంటి ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడడంతో ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. వెంకటేశ్ ఈ మూవీకి క్లాప్ కొట్టగా అల్లు అరవింత్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్ర రావు ఫస్ట్ షాట్ తీశారు. అలా ఈ పూజా కార్యక్రమానికి పలువురు స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యి సినిమా హిట్ అవ్వాలని మేకర్స్‌కు విషెస్ తెలిపారు. అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీని సాహు గరపాటి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తనతో పాటు చిరంజీవి వారసురాలు సుష్మిత కొణిదెల కూడా దీనికి నిర్మాతగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం దీనికి ‘మెగా 157’ అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు.
ఉగాది కి ఆరంభం 😍 సంక్రాంతికి సంబరం 😎 #ChiruAnil #MEGA157@KChiruTweets #Chiranjeevi pic.twitter.com/QnsRwa3qae
— We Love Chiranjeevi 💫 (@WeLoveMegastar) March 30, 2025