Sankranthiki Vastunnam : ఈ ఏడాది సంక్రాంతికి బోలెడు సినిమాలో రిలీజ్ అయ్యాయి కానీ అందులో మాత్రం విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ సక్సెస్ ను అందుకుంది. ఇటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు చేయడం మామూలు విషయం కాదు. థియేటర్లలో మాత్రమే కాదు. అటు ఓటీటీలో కూడా భారీ వ్యూస్ ని రాబడుతూ దూసుకుపోతుంది రాబడుతూ దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో టికెట్ల ధర పెంపు పై హైకోర్టులో ఫిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఫిటిషన్ను హైకోర్టు కొట్టి వేసింది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
సంక్రాంతికి వస్తున్నాం మూవీ టికెట్ ధరల పెంపు..
వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే ప్రభుత్వం మొదటి ఎనిమిది రోజులు ఇవ్వగా, ఆ తర్వాత 14 రోజుల వరకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ప్రభుత్వాల నిర్ణయాలను తప్పుపడుతూ ఏపీలో టికెట్ ధరల పెంపుపై పిటిషనర్ వేసిన ఫీల్ ను తాజాగా హైకోర్టు కొట్టి వేసింది. ఈ చిత్ర నిర్మాణ వ్యయంపై విచారణ జరిపించాలని ఈడీకి విజయవాడకు చెందిన ఎం లక్ష్మణరావు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తోసిపుచ్చింది. వ్యయం పై నిర్మాణ కోసం పెట్టిన ఖర్చు పై విచారణ జరిపించలేము. ఈడీకి ఆదేశించలెమని న్యాయస్థానం తెలిపింది. అలా చేస్తే విచారణను దుర్వినియోగం చేసినట్లు అవుతుందని తెలిపారు. అలాంటి విచారణ మొత్తం అధికార యంత్రాంగం చేతిలో ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
Also Read : ఆ నలుగురు నాశనం అయ్యాకే చచ్చిపోతా.. చంటి మనసులో ఇంతుందా..?
ఇలాంటి విచారణను కోర్టు చేయలేదని తేల్చేస్తుంది. ఈ సినిమా విడుదల అయ్యి చాలా రోజులైంది. సంక్రాంతికి వస్తున్నాం అదనపుషోలా ప్రదర్శన ఇప్పటికే పూర్తయింది. భారీ బడ్జెట్ సినిమాల టికెట్ ధరల పెంపును మొదటి పది రోజులకే పరిమితం చేస్తూ 2022 మార్చి 7న జారీచేసిన జీఓ 13ను సవరించే ప్రతిపాదనతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని గుర్తుచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈనెల 28న పీల్ కొట్టి పడేసింది..
సంక్రాంతికి వస్తున్నాం మూవీ..
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు చేసింది. థియేటర్ల వద్ద సక్సెస్ అయిన ఏ సినిమా మార్చి 1 న ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటిటి సంస్థ జీ5 లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది..