BigTV English

SRH VS DC: బ్యాటింగ్ చేయనున్న SRH…ఇవాళైనా 300 కొడతారా..ఆ టీం గెలవడం పక్కానా ?

SRH VS DC:  బ్యాటింగ్ చేయనున్న SRH…ఇవాళైనా 300 కొడతారా..ఆ టీం గెలవడం పక్కానా  ?

SRH VS DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో భాగంగా.. ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది.. మరికాసేపట్లోనే సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో… సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి చేజింగ్ చేయనుంది.


SRHలో భారీ మార్పులు

లక్నో సూపర్ జెంట్స్ జట్టు చేతుlo హైదరాబాద్ ఓడిపోయిన నేపథ్యంలో.. ఇవాళ ఒక కీలక మార్పుతో బరిలోకి దిగుతుంది SRH. సమర్జిత స్థానంలో జీషన్ అన్సారి జట్టులోకి వచ్చాడు. ఇక మిగతా ప్లేయర్లు అలాగే ఉన్నారు. ఇవాళ అయిన సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ఇద్దరు… కాస్త క్లిక్ అయితే మ్యాచ్ ఈజీగా గెలవడం ఖాయమంటున్నారు ఫాన్స్.


Also Read: IPL 2025: మనల్ని ఎవర్రా ఆపేది… పాయింట్స్ టేబుల్ లో RCB నెంబర్ వన్ ?

ఇరు జట్ల రికార్డులు

విశాఖ వేదికగా జరుగుతున్న.. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో… ఇరుజట్ల రికార్డులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 24 మ్యాచులు జరిగాయి. ఇందులో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పై చేయి సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పైన ఏకంగా 13 మ్యాచ్ లో విజయం సాధించింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా.. మంచి ప్రదర్శన కనబరిచినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటివరకు 24 మ్యాచ్లు దొరికితే ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్లో విజయం సాధించింది.
అంటే రెండు మ్యాచ్లు హైదరాబాద్ ఎక్కువగా గెలిచి ఉంది. అటు విశాఖ వేదికగా… ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఒక విజయాన్ని నమోదు చేసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ ఒక మ్యాచ్ లో ఓడిపోగా… మొదటి మ్యాచ్ లో గెలిచింది.

విశాఖ వేదిక ఢిల్లీకి అడ్వాంటేజ్ ఉంటుందా?

విశాఖ వేదికగా… జరిగే ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ కు అడ్వాంటేజ్ ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే విశాఖ ఢిల్లీ క్యాపిటల్స్ కు హోమ్ గ్రౌండ్. కాబట్టి.. హైదరాబాద్ కంటే ఢిల్లీ క్యాపిటల్స్ కు అడ్వాంటేజ్ ఎక్కువే అని చెప్పవచ్చు.

Also Read: Hardik Pandya: గుజరాత్ బౌలర్ కు పాండ్యా వార్నింగ్.. నువ్వు పిల్ల బచ్చా అంటూ!

సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ జట్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(w), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(c), జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(w), KL రాహుల్, అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్

 

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×