Mega Family : మెగా ఫ్యామిలీ లో ఎటు చూసినా పెళ్లి హడావిడి మొదలైంది. మరికొద్ది గంటల్లో ఇటలీ లో లావణ్య వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలు ప్రారంభమవుతాయి .ఈసారి మెగా వారి డెస్టినేషన్ వెడ్డింగ్ ఇటలీ కావడంతో పెళ్లిలో పాల్గొనడానికి కుటుంబ సభ్యులు ఇటలీకి చేరుకున్నారు . అక్కడ సందడి చేస్తున్న మెగా ఫ్యామిలీ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఉపాసన ఎంత ట్రై చేసినా ఈసారి మెగా అభిమానులు క్లీం కారా ఫోటోను కనిపెట్టేశారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆ ఫోటోని వైరల్ చేస్తున్నారు.
సంవత్సరాల తరబడి గుట్టుగా ఉన్న తమ ప్రేమాయణాన్ని ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ రూపంలో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు వరుణ్ తేజ్, లావణ్య. ఇక ఇప్పుడు తన కుటుంబ పెద్దల సమక్షంలో ఏడడుగులు వేయడానికి సిద్ధపడుతున్నారు. నవంబర్ ఒకటవ తారీఖున ఈ ప్రేమ పక్షులు పెళ్లి బంధంలోకి అడుగు పెడతాయి. ఇక తమ్ముడు పెళ్లి బాధ్యత మొత్తం దగ్గరుండి నిర్వహించడానికి రామ్ చరణ్ దంపతులు ఇటలీ చేరుకున్నారు. ఇలా మెగా మనవరాలు మొదటి ఫారిన్ ట్రిప్ బాబాయ్ పెళ్లి కోసం ఇటలీ గా మారింది.
వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించిన అన్ని పనులు రామ్ చరణ్, ఉపాసన దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ తన కుటుంబంతో ఇటలీ చేరుకున్నారు. ఇక కుటుంబం అంతా ఒక్కటిగా చేరడంతో తెగ ఫోటోలు దిగి సంబరపడిపోతున్నారు. ఈ ఫోటోలను ఉపాసన- చరణ్ తమ ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసుకోవడం జరిగింది. మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఒక ఫ్రేమ్లో కనిపించడం తో అభిమానులు ఆ ఫోటోని బాగా వైరల్ చేశారు.
బిడ్డ పుట్టిన తర్వాత ఉపాసన రామ్ చరణ్ ఎప్పుడు కుటుంబమంతా కలిసి ఉన్న ఫోటోలు పెట్టిన తమ కూతురి ముఖాన్ని ఒక లవ్ సింబల్ తో కప్పేయడం లేక కనిపించకుండా కవర్ చేయడం మనం గమనించవచ్చు. ఎక్కడ ఫోటోలో కూడా అదే చేసినప్పటికీ ఫ్యాన్స్ క్లీంకారా ఫోటోను వెతికి మరి కనుక్కున్నారు. అలా ఉపాసన తన కూతురు ఫోటోని ఎంత దాచాలని ట్రై చేసిన కుదరలేదు. ఇంతకీ ఇది ఎలా జరిగిందో తెలుసా?
మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి దిగిన ఫోటోలలో ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర దిగిన ఫోటో కూడా ఉంది. షేర్ చేసిన ఉపాసన తన కూతురు ఫేస్ పై లవ్ సింబల్ ఏమోజి యాడ్ చేసి కవర్ చేయడానికి ట్రై చేసింది. ఆ స్విమ్మింగ్ పూల్ వాటర్ రిఫ్లెక్షన్ క్లీంకారా ఫేస్ కనపడుతుంది అన్న విషయాన్ని మర్చిపోయింది. ఎప్పటినుంచో మెగా మనవరాలు ఎలా ఉంటుంది చూడాలని ఉవ్విళ్ళూరుతున్న మెగా ఫ్యాన్స్ ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోలేదు. అలా నీటిలో రివర్స్లో కనిపిస్తున్న క్లీంకార ఫేస్‌ను వైరల్ చేయడమే కాకుండా ఉపాసన మేడం నీటిలో ఫేస్ కవర్ చేయడం మర్చిపోయారు అంటూ కామెంట్స్ పెట్టి ట్రెండింగ్ చేస్తున్నారు. ఎలాగైతేనే బాబాయ్ పెళ్లికి అమ్మాయి ఫోటో బయటకు వచ్చేసింది..