BigTV English

Wayanad Landslides: వయనాడ్ విలయం.. చిరు, చరణ్ భారీ విరాళం..

Wayanad Landslides: వయనాడ్ విలయం.. చిరు, చరణ్ భారీ విరాళం..

Megastar Chiranjeevi and Ram Charan have donated Rs 1 crore: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో టాలీవుడ్ అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటి వరకు తన చేతులతో ఎంతో మందిని ఆదుకున్నాడు. చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకొస్తాడు. అయ్యా అనారోగ్యంగా ఉందంటే చాలు ట్రీట్మెంట్‌కి అయ్యే ఖర్చునంతా భరిస్తానంటాడు. అంతటి మహోన్నతమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అలాంటి చిరు ఇటీవల కేరళలోని వయనాడ్ జిల్లాలో జరిగిన మారణకండ చూసి చలించిపోయాడు.


దీంతో వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి వయనాడ్ బాధితుల కోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా చిరు తన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పోస్ట్ పెట్టాడు. ‘‘గత కొన్ని రోజులుగా ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసంలో వందలాది మంది విలువైన ప్రాణాలను కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యాను.

Also Read: వయనాడ్ బాధితుల కోసం ముందుకు వచ్చిన అల్లు అర్జున్.. రూ.25 లక్షల ఆర్థిక సాయం


వయనాడ్ దుర్ఘటన బాధితులకు నా హృదయం వెల్లివిరుస్తోంది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చరణ్‌, నేను కలిసి రూ.1 కోటి విరాళంగా అందజేస్తున్నాం. బాధలో ఉన్న వారందరూ కోలుకోవాలని నా ప్రార్థనలు’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో తండ్రి, కొడుకుల సాయానికి మెగా అభిమానులు, ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా వయనాడ్ జిల్లాలో సంభవించిన ఈ విపత్తుకు ఎన్నో ప్రాణాలు బలైపోయాయి. ఇప్పటికీ దాదాపు 350కి పైగా ప్రాణాలు విడిచారు. మరెందరో శిథిలాల కింద సజీవ సమాధి అయిపోయారు. ఇంకొందరు హాస్పిటల్‌లో గాయాలతో కొట్టిమిట్టాడుతున్నారు.

ఇలాంటి ఒక ఊహించని విపత్తు యావత్ దేశాన్ని ప్రస్తుతం కుదిపేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రకృతి విపత్తు పై ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు తమవంతు సాయం అందించారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఫ్యామిలీ రూ.50 లక్షలు, చియాన్ విక్రమ్ రూ.20 లక్షలు, మోహన్ లాల్ రూ.3 కోట్లు, రష్మిక రూ.10 లక్షలు, అల్లు అర్జున్ రూ.25 లక్షలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు. వీరితో పాటు మరెందరో సెలబ్రెటీలు తమవంతు సాయం అందించి గొప్పమనసు చాటుకున్నారు.

 

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×