Megastar Chiranjeevi Wishes to indian olympic players: పారిస్ ఒలింపిక్స్ అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ ఒలింపిక్స్‌లో ఇండియా నుంచి 117మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో కొంతమంది రజతంతోపాటు కాంస్యం వంటి పతకాలు సాధించి ఇండియా పేరును నిలబెట్టారు. ఈ తరుణంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 117 క్రీడాకారులకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.
‘షూటింగ్ స్టార్స్ సరబ్ జ్యోత్ సింగ్, మను బాకర్, స్వప్నిల్, ఇండియా హాకీ టీం, హాకీ ఆటగాడు శ్రీజేశ్, జావెలిన్ ఛాంపియన్ నీరజ్ చోప్రా, స్టార్ రెజ్టర్ అమన్ షెరావత్ సహాతోపాటు ఒలిపింక్స్ లో పాల్గొన్న 117 మంది క్రీడాకారులకు నా ప్రత్యేక అభినందనతలు. వినేశ్ ఫొగాట్ నీవు నిజమైన పోరాట యోధురాలివి’. అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా, చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి పారిస్ ఒలింపిక్స్ ను చూసేందుకు పారిస్ వెళ్లిన సంగతి తెలిసిందే. పారిస్ వీధుల్లో కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను చిరంజీవితోపాటు ఆయన కోడలు ఉపాసన, రామచరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయ్యాయి.
Also Read: ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. ట్రైలర్ డేట్ ఫిక్స్ అయిపోయింది
సినిమా విషయానికొస్తే.. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా..యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దాదాపుగా పూర్తి కొవొస్తుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.
My Heartfelt Congratulations to
Our Shooting stars @realManuBhaker 🥉 @SarabjotSingh30 &
Manu Bhaker 🥉 #SwapnilKusale 🥉
Our Team #IndianHockey &
Legend @16Sreejesh 🥉
Our Javelin champ @Neeraj_Chopra1 🥈
Star wrestler @AmanSehrawat57🥉To each and every player… pic.twitter.com/VK2hMttDNN
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 10, 2024