Paris Olympics: ఫ్రాన్స్ దేశ రాజధాని పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడా పోటీలు ఆదివారం ముగియనున్నాయి. మెడల్స్ జాబితాలో ఇండియా 70వ స్థానంలో కొనసాగుతోంది. ఒలింపిక్స్ ముగిసే సమయానికి ఈ ర్యాంక్ ఇంకా దిగజారే అవకాశం ఉంది. ఎందుకంటే ఒలింపిక్స్ ముగియక ఒకరోజు ముందే భారత్ ఖాతా ముగిసిపోయింది. శనివారం జరిగిన మహిళల 76 కేజీల కుస్తీ పోటీల క్వార్టర్ ఫైనల్లో భారత రెజ్లర్ రీతికా హూడా ఓటమి పాలవడంతో ఇండియా ప్రయాణం ముగిసింది. ముఖ్యంగా ఈసారి అసలు బంగారు పతకం లేకుండా భారత ఆటగాళ్లు తిరుగు ప్రయాణం కానున్నారు.
ఇప్పటివరకు జరిగిన ఒలింపిక్ క్రీడల్లో భారత్ కు ఒక రజతం, అయిదు కాంస్య పతాకలు లభించాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని ఒలింపిక్స్ భారత్ కు ఇదే సెకండ్ బెస్ట్. ఎందుకంటే భారత ఆటగాళ్లు టోక్యో 2020 ఒలింపిక్స్ లో ఏడు మెడల్స్ సాధించారు.
Also Read: ‘వినేశ్ ఫోగట్ కు న్యాయం జరుగుతుంది’.. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్!
ముందుగా భారత షూటర్ మనూ భాకెర్ భారత్ కు రెండు కాంస్య పతకాలు సాధించి పెట్టింది. టోక్యో ఒలింపిక్స్ లో బల్లెం వీరుడు నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించగా.. ఈ సారి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పురుషుల కుస్తీ పోటీల్లో అమన్ సెహ్రావత్ తన తొలి ఒలింపిక్స్ లోనే కాంస్య పతకం సాధించాడు. ఇండియాన్ హాకీ టీమ్ కూడా కాంస్య పతకం సాధించింది. పురుషుల షూటింగ్ లో స్వప్నిల్ కుసలె కాంస్య పతకం సాధించాడు.
భారత హాకీ జట్టు వరుసగా ఒలింపిక్స్ లో దేశానికి రెండు సార్లు పతకాలు తీసుకొచ్చింది. ఇలా 1972 తరువాత జరగడం ఇధి రెండోసారి. అమన్ సెహ్రావత్ కాంస్య పతకం సాధించిన అతిపిన్నవయస్కుడైన రెజ్లర్ గా రికార్డు సృష్టించాడు.
Also Read: పివి సింధు రికార్డ్ బ్రేక్.. ఒలింపిక్స్ లో భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ అరుదైన ఫీట్!
మరోవైపు పతకాలు సాధిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి (బ్యాడ్మింటన్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), లొవ్లీనా బోర్గొహెయిన్ (బాక్సింగ్), మీరా బాయి చాను (వెయిట్ లిఫ్టింగ్), సిఫ్గ్ కౌర్ శర్మ్ (షూటింగ్).. ఒలింపిక్స్ లో ఫెయిల్ అయ్యారు.
వీరిందరినీ పక్కపబెడితే.. కాంస్య పతకం సాధించడానికి చాలా చేరువలోకి వచ్చి మిస్ అయిన వారిలో లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), అర్జున్ బబూతా ఉన్నారు.
చివరగా ఇండియాకు మరో రజత పతకం కోసం న్యాయపోరాటం జరుగుతోంది. వినేశ్ ఫోగట్ మహిళల 50 కేజీల ఫైనల్ మ్యాచ్ కు ముందు శరీర బరువు 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో ఆమెపై అనర్హత వేటు వేశారు. అయితే ఆమె అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. స్పోర్స్ కోర్టులో అప్పీల్ చేసింది. ఆ అప్పీల్ పై ఆదివారం సాయంత్రం కోర్టు తీర్పు వెలువరించనుంది.
Also Read: తినడానికి తిండి లేదు.. తండ్రి కూలీ.. కట్ చేస్తే ఇప్పుడు ఒలింపిక్ హీరో