Jr NTR WAR 2: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ముఖ్యపాత్రలో నటిస్తున్న సినిమా వార్ 2. 2019లో విడుదలైన బ్లాక్ బాస్టర్ మూవీ వార్ కి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఎస్ రాజ్ ఫిలిం స్పై యూనివర్స్ లో ఆరవ చిత్రంగా వార్ 2 రూపొందుతోంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 2025 ఆగస్టు 14న విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అందులో ఎన్టీఆర్ పాత్ర పై విమర్శలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ వివరాలు చూద్దాం..
ఆ పాత్రలో ఎన్టీఆర్ అస్సలు సెట్ అవ్వలే..
హృతిక్ రోషన్ మేజర్ కబీర్ దలివాల్ గా నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కి ప్రత్యర్థీ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో ఎన్టీఆర్ పాత్రకు ఆయన తగిన కటౌట్ కాదంటూ, విమర్శలు వస్తున్నాయి. ఈ పాత్రలో హృతిక్ రోషన్ తో తలపడ్డానికి, హీరో ప్రభాస్, అయితే సూట్ అవుతాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అందుకు ప్రధాన కారణం, హృతిక్ రోషన్ కి ప్రత్యర్థి పాత్రలో నటించే హీరో ఆయనకి దీటుగా, సరైన హైట్ లో లేడనే విమర్శలు వస్తున్నాయి. ట్రైలర్ లో హృతిక్ రోషన్ తో తలపడడానికి ఎన్టీఆర్ స్టూల్ వాడాడని, దానిని గ్రాఫిక్స్ లో ఐస్ గా మార్చారు అంటూ, కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా హృతిక్ రోషన్ కి సమానమైన హైట్ లో ప్రత్యర్థి హీరో లేడనేది వాదన.
మల్టి స్టారర్ మూవీ గా వార్ 2..
భారీ బడ్జెట్ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెల్స్ ఉంటాయని సమాచారం. ఈ యాక్షన్స్ సన్నివేశాలు హీరోలు ఇద్దరు హోరాహోరీగా పోటీ పడతారంటూ, హాలీవుడ్ మూవీ రేంజ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని సమాచారం. ఇప్పటికే ఈ మూవీ తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ 120 కోట్లకు జరిగినట్లు టాక్.. అటు బాలీవుడ్, టాలీవుడ్ లోను వార్ 2 సినిమాకు ఎన్టీఆర్ 60 కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడని అప్పట్లో ఓ వార్త గట్టిగానే వినిపించింది. బాలీవుడ్ లో ఓ సౌత్ హీరోకు ఈ రేంజ్ లో పారితోషకం అందడం అంటే అది మామూలు విషయం కాదంటున్నారు ఫ్యాన్స్. మరోవైపు ఇప్పుడు ఎన్టీఆర్ టాలీవుడ్ తో పాటు విదేశాల్లో కూడా క్రేజ్ ఉందని, అందుకే ఆయన రెమ్యూనేషన్ అమాంతం పెరిగింది అంటూ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.
వార్ 2 సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ రెండు సంవత్సరాలుగా జరుగుతున్నా, మొత్తం షూటింగ్ 150 రోజులు మాత్రమే జరిగింది. ఈ మూవీ కోసం చిత్ర యూనిట్ 6 దేశాలలో షూటింగ్ జరిగినట్లు సమాచారం. ఈ సినిమాలో హృతిక్, జూనియర్ డాన్స్ సినిమాకే ప్రత్యేకంగా నిలవనున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.