CSK Fans : టీమిండియా మాజీ క్రికెటర్ ఎం.ఎస్. ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇవాళ ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు జట్లు కూడా ప్లే ఆప్స్ రేస్ లోంచి నిష్క్రమించాయి. కాకపోతే వీటి మధ్య నామమాత్రపు పోరు జరుగుతోంది. అభిమానుల ఫోకస్ అంతా ఓ వైపు లెజెండ్ ధోనీ.. మరోవైపు 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పైనే ఉంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది.
Also Read : Siddhant-Sara : సారాకు మరో బ్రేకప్.. సిద్ధాంత్ కూడా వదిలేశాడు..!
ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే..? ఓ వ్యక్తి అచ్చం ధోని లాగా ఉన్నాడు. ధోనీ ఏంటి ఇక్కడున్నాడు అనేలా అచ్చుగుద్దినట్టే ఉండటం చూసి అంతా ఆశ్చర్యపోయారు. అసలు ఎవరు ఇతను..? ధోనీలానే కనిపిస్తున్నాడని అందరూ సెర్చ్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరూ మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని కొందరూ పేర్కొనడం విశేషం. అయితే ఇప్పటికే సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. మొదటి సారి మాత్రమే టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు అలవొకగా ఛేజింగ్ చేస్తోంది.
ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేలవ ప్రదర్శనతో చెత్త రికార్డును ఈ సీజన్ లో మూట కట్టుకుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు మాత్రం చాలా సింపుల్ గా గెలవాల్సిన మ్యాచ్ ల్లో చేజేతులా ఓడిపోయి.. ఈ సీజన్ లో ప్లే ఆప్స్ నుంచి నిష్క్రమించింది. ఇవాళ జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ అయూష్ మాత్రె 43, కాన్వే 10, ఉర్విల్ పటేల్ డకౌట్ అయ్యాడు. అశ్విన్ 13, జడేజా 1, బ్రెవిస్ 42, శివమ్ దూబే 39, కెప్టెన్ ధోనీ 16 పరుగులు మాత్రమే చేశాడు. కంబోజ్ 5, నూర్ అహ్మద్ 2 పరుగులు చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 187 పరుగులు చేయగలిగింది. ప్రధానంగా అయూష్, బ్రెవిస్ రాణించడంతో చెన్నై గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ మాత్రం మునుపటిలా ఫామ్ లో కొనసాగడం లేదు. ఇప్పటికే చాలా సీనియర్ కావడం.. ఐపీఎల్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న చెన్నై జట్టు యాజమాన్యం ధోనీని నియమించింది. మరోవైపు ఈ మ్యాచ్ లో 43 ఏళ్ల ధోని.. 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ తలపడ్డారు. వయస్సులో అందరికీ కంటే ఎక్కువ.. అందరి కంటే తక్కువ ఉన్న క్రీడాకారులు ఈ ఐపీఎల్ లో తలపడటం విశేషం.
— Out Of Context Cricket (@GemsOfCricket) May 20, 2025