BigTV English
Advertisement

Siddhant-Sara : సారాకు మరో బ్రేకప్.. సిద్ధాంత్ కూడా వదిలేశాడు..!

Siddhant-Sara : సారాకు మరో బ్రేకప్.. సిద్ధాంత్ కూడా వదిలేశాడు..!

Siddhant-Sara :  సచిన్ టెండూల్కర్ గారాల పట్టిగా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సారా టెండూల్కర్. స్టార్ కాకపోయినా సినిమా హీరోయిన్లకు మించి క్రేజ్ తెచ్చుకుందీ స్టార్ కిడ్. సోషల్ మీడియాలో సారాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు.. ఇప్పుడు బ్రాండింగ్ ద్వారా కూడా మంచి డబ్బు సంపాదిస్తోంది ముద్దుగుమ్మ. ఈమె లవ్, డేటింగ్, రిలేషన్ షిప్ విషయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోందీ ముద్దుగుమ్మ. గిల్ (Gill) తో ప్రేమాయణం నడుపుతుందని, ఇద్దరకీ బ్రేకప్ కూడా అయ్యిందని ప్రచారం జరిగింది.  సారా టెండూల్కర్.. గోవాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నటుడు సిద్ధాంత్ చతుర్వేది తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.


Also Read :  RCB vs SRH : బెంగళూరుకు షాక్.. వెంటాడుతున్న వరుణుడు.. వేదిక లో మార్పు

అయితే తాజాగా సిద్దాంత్  చతుర్వేది (Siddhant Chaturvedi)  కి కూడా బ్రేకప్ చెప్పినట్టు సమాచారం. క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో బ్రేకప్ తరువాత సిద్దాంత్ చతుర్వేది తో సారా  ఇప్పుడిప్పుడే స్నేహంగా ఉంటుందని.. వాళ్లు ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్న తరుణంలోనే బ్రేకప్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు సారా చేసేది నిజమా..? కాదా..? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇంత కంటే ముందే హిమాన్ష్ కోహ్లీతో కూడా సారా డేటింగ్ లో ఉందని ఆమధ్య ప్రచారం జరిగింది. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయినట్లు సమాచారం. అసలు సారా టెండూల్కర్ ఇలా ఎందరికి బ్రేకప్ చెబుతుందని పలువురు పేర్కొంటున్నారు. కొందరూ సచిన్ టెండూల్కర్ పరువు తీస్తుంది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Also Read :  Sanjiv Goenka : 27 కోట్లు బొక్క… చేసేదేమీ లేక పంత్ కు మసాజ్ చేస్తున్న లక్నో ఓనర్

ఈ రూమర్స్  సోషల్ మీడియాలో మంటలు రేపుతున్నా.. శుభ్‌మన్ గిల్ తన ప్రొఫెషనల్ జీవితం వైపు దృష్టి సారించాడు.   ప్రస్తుతం అతడు ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ జట్టును విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. పాయింట్ల పట్టికలో GT అగ్రస్థానంలో ఉండడం.. శుభ్‌మన్ నాయకత్వ నైపుణ్యాలకు నిదర్శనంగా మారింది. అంతేకాదు.. భారత వన్డే జట్టులో అతను వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు, రోహిత్ శర్మ పదవీ విరమణ అనంతరం దేశానికి నాయకత్వం వహించే భవిష్యత్ కెప్టెన్‌గా పరిగణించబడుతున్నాడు. అతని బ్యాటింగ్ ఫామ్, సమయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం, యువ క్రికెటర్లను నడిపించే శైలి ఇవన్నీ భవిష్యత్తులో అతన్ని ఒక సంపూర్ణ నాయకుడిగా తీర్చిదిద్దే అవకాశాలను పెంచుతున్నాయి. మొత్తానికి శుభ్‌ మన్ గిల్ ప్రస్తుత దశలో వ్యక్తి  గతంగా పలు ఊహాగానాలు ఎదుర్కొంటున్నా.. ప్రొఫెషనల్ క్రికెట్‌లో తన స్థాయిని నిలబెట్టుకుంటూ  మరింతగా ఎదుగుతున్న యువ క్రికెటర్‌గా చక్కటి ముద్ర వేస్తున్నాడు. వ్యక్తి గత జీవితంలో ఉన్న సంఘటనలు అతని ఆట పై ప్రభావం చూపకుండా ఉండడం.. ఒక ఆటగాడిగా చాలా గొప్ప విషయం అనే చెప్పవచ్చు.

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×