Prabhas Fauji: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమాలు విడుదలకు లేట్ అవుతున్నాయేమో కానీ తను మాత్రం బ్రేక్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌లో పాల్గొంటూనే ఉన్నాడు. ఇప్పటికే మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ను పూర్తి చేశాడు ప్రభాస్. దాని తర్వాత హనూ రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సెట్‌లో అడుగుపెట్టనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమం పూర్తయ్యి చాలాకాలం అయ్యింది. కానీ షూటింగ్‌పై మాత్రం పూర్తిస్థాయిలో అప్డేట్ లేదు. తాజాగా ఈ మూవీలో నటిస్తున్న ఒక బాలీవుడ్ సీనియర్ యాక్టర్ ‘ఫౌజీ’పై క్రేజీ అప్డేట్ అందించి ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు.
చాలా లేట్
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ షూటింగ్ పూర్తవ్వడంతో అది విడుదలయితే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ ఏడాది సమ్మర్‌లో ఎలాగైనా ఈ మూవీని విడుదల చేస్తామని చెప్పిన మేకర్స్.. దాని తర్వాత దీని గురించి అస్సలు ప్రస్తావించడం లేదు. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇటీవల దర్శకుడు మారుతి దీనికి సంబంధించిన అప్డేట్ అందిస్తూ ట్వీట్ చేశాడు. ఇంకా ఈ మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుందని బయటపెట్టాడు. దాంతో పాటు మరికాస్త షూటింగ్ కూడా పెండింగ్ ఉందని చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి చూస్తే ‘రాజా సాబ్’ను థియేటర్లలో ఎంజాయ్ చేయాలంటే ఇంకా కొన్నిరోజులు ఎదురుచూడాలని ఫ్యాన్స్‌కు క్లారిటీ వచ్చేసింది. అలా ప్రభాస్ అప్‌కమింగ్ మూవీ ‘ఫౌజీ’పై ఫోకస్ కూడా పెరిగింది.
షూటింగ్ అప్డేట్
‘సీతారామం’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులందరినీ విపరీతంగా ఆకట్టుకున్న దర్శకుడు హనూ రాఘవపూడి. హను ప్రేమకథలంటే చాలామంది ప్రేక్షకులకు ఇష్టం. తను వేర్వేరు జోనర్లలో కథలు రాసుకున్నా అందులో గుర్తుండిపోయే ప్రేమకథ మాత్రం కచ్చితంగా ఉంటుంది. అలా ప్రభాస్‌తో ‘ఫౌజీ’ అనే ప్రేమకథ తెరకెక్కిస్తున్నాడని తెలియగానే ఫ్యాన్స్ అంతా తెగ హ్యాపీ అయిపోయారు. ఇది కూడా ‘సీతారామం’ లాగానే ఉంటుందని అంచనా వేయడం మొదలుపెట్టారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుండగా.. తాజాగా ‘ఫౌజీ’ షూటింగ్‌పై అప్డేట్ అందించాడు ఈ నటుడు.
Also Read: ప్రభాస్‌కు మరిన్ని కండీషన్స్ పెట్టిన సందీప్ రెడ్డి వంగా
షెడ్యూల్ పూర్తయ్యింది
‘‘ప్రభాస్ (Prabhas) ఇంకా నాతో పాటు ఫౌజీ (Fauji) షూటింగ్‌లో జాయిన్ అవ్వలేదు. కానీ నేను మాత్రం ఒక షెడ్యూల్‌ను పూర్తిచేశాను. ఈ నెలాఖరులో ప్రభాస్ కూడా ఈ షూటింగ్‌లో జాయిన్ అవ్వనున్నాడు. జయప్రదతో నా షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ఫోటోషూట్ జరుగుతున్న సమయంలో నా చేతికి గాయమయ్యింది. అందుకే ఫోటోషూట్ పూర్తవ్వగానే హాస్పిటల్‌కు వెళ్లాను. ప్రభాస్‌తో పాటు మూవీ టీమ్ కూడా నన్ను ఆందోళనపడొద్దని, రెస్ట్ తీసుకోమని చెప్పారు’’ అని చెప్పుకొచ్చాడు మిథున్ చక్రవర్తి. దీన్ని బట్టి చూస్తే ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ పూర్తిగా సిద్ధమయ్యాడని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వి నటిస్తోంది.
#Prabhas hasn't joined my scenes yet.I shared screenspace with JayaPrada for one schedule. On the day of photoshoot , I fractured my hand.I did the photoshoot & then went to the hospital. Prabhas & movie team told me not to worry, take proper rest.
– #MithunChakraborty
sir#Fauji pic.twitter.com/8aOBzAUcEi— Vaishnu (@VaishnaliS) April 15, 2025