Drumsticks Benefits: మునగకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషక విలువలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసేందుకు కూడా హెల్ప్ చేస్తాయట. ఇందులో అధిక మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు, విటమిన్ C, విటమిన్ A, కాల్షియం, కటిన్, పొటాషియం, ఐరన్, ప్రోటీన్ ఉన్నాయి.
యాంటీ ఆక్సిడెంట్స్
మునగకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తీసివేయడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంలో కూడా మునగకాయలు సహాయపడతాయట.
గుండెకు వెరీ గుడ్
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో మునగకాయ ఎంతో సహకరికస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పొటాషియం, మ్యాగ్నీషియం, ఫైబర్ వంటివి గుండెపై యాసిడ్స్ చెడు ప్రభావం చూపకుండా చేయడంలో తోడ్పడతాయట. హై బ్లడ్ ప్రెషర్‌ను కంట్రోల్ చేయడంలో కూడా మునగకాయ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అధిక పోషణ
మునగకాయలో ప్రోటీన్, ఐరన్, కాపర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. శరీరానికి మంచి పోషణ అందించి, శక్తిని పెంచడంలో ఇవి సహాయపడతాయట. బీపీని కంట్రోల్‌లో ఉంచేందుకు కూడా ఇవి సహాయపడతాయట.
ఫైబర్ రిచ్ ఫుడ్
మునగకాయలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేలా సహాయపడుతుంది. పేగు సమస్యలు నివారించడానికి మునగకాయను తరచుగా తినొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
నేచురల్ డీటాక్సిఫికేషన్
శరీరంలోని మలినాలను నేచురల్‌గా తొలగించుకోవాలంటే తరచుగా తీసుకునే ఆహారంలో మునగకాయను చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మునగకాయలోని విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో కలిసిన విషాలను బయటకు పంపి, రక్తాన్ని శుద్ధి చేస్తాయట. ఇది శరీరాన్ని సహజంగా డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది.
ALSO READ: ఆరోగ్యవంతమైన జుట్టు కోసం ఇలా చేయండి
దీన్ని బెస్ట్ వెజిటేబుల్ ఇన్ ద వరల్డ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇతర కూరగాయలతో పోలిస్తే మునగలో అన్ని రకాల పోషకాలు అధికంగా ఉంటాయట. పాలతో పోలిస్తే మునగకాయలోనే 4 రేట్లు ఎక్కువ కాల్షియం ఉంటుందట. అరటి పండ్ల కన్నా 3 రేట్ల పొటాషియం ఇందులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా సిట్రస్ పండ్ల కంటే మునగలోనే 7 రేట్లు ఎక్కువ విటమిన్స్ ఉంటాయట. పాలకూర కంటే 25 రేట్లు ఎక్కువ ఐరన్ ఇందులో ఉందట.
అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కూడా మునగకాయలు సహాయపడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుందట. దీంతో బ్లడ్‌లోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి కూడా మునగకాయ సహాయపడుతుందట. తరచుగా తీసుకునే ఆహారంలో దీన్ని చేర్చుకోవడం వల్ల సహజంగానే ఎనర్జీ పెరగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుతకే ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో వీటిని తప్పకుండా చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.