BigTV English

ChatGPT : మామిడిపండ్లు, పుచ్చకాయ కొనేందుకు చాట్‌ జీపీటీ.. ఎవడి వాడకం వాడిది..

ChatGPT : మామిడిపండ్లు, పుచ్చకాయ కొనేందుకు చాట్‌ జీపీటీ.. ఎవడి వాడకం వాడిది..

ChatGPT : కిరాక్ ఐడియాలు వస్తుంటాయి. ఒక్కొక్కరూ ఒక్కో టైప్. చాట్ జీపీటీ తెలుసుగా. దాన్ని అన్నిట్లో తెగ వాడేస్తున్నారు. కోర్టులో కేసు గెలవడానికి.. ఆఫీసులో జాబ్ చేయడానికి.. లవ్ లెటర్ రాయడానికి.. ఇదీ అదీ అనే తేడా లేదు. ఎక్కడ దొరికితే అక్కడ వాడేస్తున్నారు. చాట్ జీపీటీ సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. అలాంటిదే రీసెంట్‌గా మరో ఘటన జరిగింది. పుచ్చకాయ కొనడానికి చాట్ జీపీటీని వాడేశారు ఓ యువకుడు. ఆ వీడియో సరిహద్దులు దాటేసి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.


చాట్ జీపీటీతో పుచ్చకాయ కొనడం ఎలా?

బంగ్లాదేశ్‌లో ఓ వ్యక్తి రోడ్ సైడ్ పుచ్చకాయలు అమ్మే బండి దగ్గరికి వెళ్లాడు. ఏ పుచ్చకాయను సెలెక్ట్ చేసుకోవాలో అతనికి అర్థం కాలేదు. వెంటనే అతనికో బంపర్ ఐడియా వచ్చింది. జేబులోంచి సెల్ ఫోన్ తీశాడు. ఏఐతో సొల్యూషన్ వెతికాడు. చాట్ జీపీటీ ఓపెన్ చేసి.. ఆ బండిపై ఉన్న పుచ్చకాయలను చూపించాడు. ఇందులో ఏ కాయ సెలెక్ట్ చేసుకోవాలో చెప్పమంటూ చాట్ జీపీటీని అడిగారు. రెడ్‌గా, తియ్యగా ఉండాలని సూచించాడు. అతడే ఓ కాయను చూపిస్తూ.. ఇది ఎలా ఉంటుందని ఏఐని అడిగాడు. ఆ పుచ్చకాయపై ఉన్న చారలు, దాని గ్లో ఆధారంగా చాట్ జీపీటీ ఆ కాయను విశ్లేషించింది. బహుశా ఈ పుచ్చకాయ బాగానే ఉండొచ్చని ఏఐ సూచించింది.


పుచ్చకాయ కట్ చేస్తే..

చాట్ జీపీటీపై నమ్మకంతో ఆ కాయను కట్ చేపిస్తాడు ఆ యువకుడు. ఆ బండి వాడు పుచ్చకాయ ముక్క కోసి చూడగా.. అనుకున్నట్టుగానే అది ఎర్రని ఎరుపురంగులో ఉంది. తిని చూస్తే టేస్ట్ చాలా బాగుంది. చాట్ జీపీటీ సెలక్షన్ సరైనదే అని ప్రూవ్ అయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడది వరల్డ్ వైడ్ చక్కర్లు కొడుతోంది.

మామిడిపండ్ల క్వాలిటీ ఎలా చెక్ చేయాలంటే..

పుచ్చకాయతోనే ఆగలేదు ఆ యువకుడు. మామిడి పండ్లను సైతం సెలెక్ట్ చేయమని చాట్ జీపీటీని అడుగుతాడు. మ్యాంగోస్ ఎంపిక కోసం అతనికి పలు సలహాలు ఇస్తుందది. మామిడిపండుపై నల్లని మచ్చలు ఉండొద్దని, మెత్తగా కాకుండా గట్టిగా ఉండాలని, బరువుగా ఉంటే మంచిదని సూచిస్తుంది. అలాంటి పండ్ల కోసం వెతకమని చెబుతుంది. పర్‌ఫెక్ట్ పండు కోసం మామిడి వాసన కూడా చూడమని సూచిస్తుంది. చాట్ జీపీటీ చెప్పినట్టే మంచి నాణ్యత కలిగిన మామిడిపండ్లను కొంటాడు ఆ వ్యక్తి.

Also Read : మెట్రోలో గలీజ్ పనులు.. ఎవడి పిచ్చి వాడిదే..

వంటింటి నేస్తం చాట్ జీపీటీ..

ఇలా ChatGPT మన డైలీ రోటీన్‌లో ఎంత బాగా ఉపయోగపడుతుందో చెప్పడానికి ఈ వీడియో ఇంకో ఎగ్జాంపుల్. గతంలోనూ ఇలాంటివే పలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. రెండు వారాలుగా ఫ్రిడ్జ్‌లో ఉన్న చెర్రీస్ తినడానికి పనికొస్తాయో లేదో చెప్పాలంటూ ఓ వ్యక్తి ఇలానే చాట్ జీపీటీని అడిగితే.. పెద్ద లిస్టే చెప్పింది ఏఐ టెక్నాలజీ. ఇలా అనేక రకాలుగా ఏఐ ఆధారిత చాట్ జీపీటీ యూజ్ అవుతోంది. గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. ఇలాంటి అనేక వీడియోలు కనిపిస్తాయి. మీరూ ఓ లుక్కేయండి…

Related News

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Big Stories

×