BigTV English

OTT Movie : ఈ వ్యాంపైర్ హంటర్స్ ఆటకు రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే… బ్లడీ బ్లడ్ బాత్

OTT Movie : ఈ వ్యాంపైర్ హంటర్స్ ఆటకు రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే… బ్లడీ బ్లడ్ బాత్

OTT Movie : ఇటీవల కాలంలో జాంబీ సినిమాలకు ఆదరణ పెరిగింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా మాత్రం జాంబీలది కాదు. కానీ ఇదొక అద్భుతమైన వ్యాంపైర్ మూవీ. ఒక్కసారి ఈ మూవీని చూడడం స్టార్ట్ చేస్తే ఆపరిక. అంత బాగుంటుంది ఈ వ్యాంపైర్ యాక్షన్ థ్రిల్లర్. మరి ఈ మూవీ కథేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.


కథలోకి వెళ్తే…

బడ్ జబ్లోన్స్కీ (జామీ ఫాక్స్) అనే సామాన్య పూల్ క్లీనర్ చుట్టూ తిరుగుతుంది ఈ మూవీ. వాస్తవానికి లాస్ ఏంజిల్స్‌లోని సాన్ ఫెర్నాండో వ్యాలీలో వాంపైర్ హంటర్ ‌గా పని చేస్తాడు. కానీ ఇప్పుడు ఆ పని మానేసి మామూలు వ్యక్తిగా జీవితాన్ని గడుపుతాడు. బడ్ తన 10 ఏళ్ల కుమార్తె పైజ్ (జియాన్ బ్రాడ్‌నాక్స్), మాజీ భార్య జోసెలిన్ (మీగన్ గుడ్) కోసం మంచి జీవితాన్ని అందించాలని కోరుకుంటాడు. అయితే అతని ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుంది. జోసెలిన్ తమ కుమార్తెను ఫ్లోరిడాకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే బడ్ ఆ పాప స్కూల్ ఫీజులు, బ్రేసెస్ కోసం డబ్బు చెల్లించలేకపోతాడు. అయితే అతనికి కూతురిని వదిలిపెట్టి ఉండడం కూడా ఇష్టం ఉండదు. అందుకే బడ్ తన ఆదాయాన్ని పెంచుకోవడానికి, వాంపైర్ హంటింగ్ యూనియన్ ‌లో తిరిగి చేరాలని డిసైడ్ అవుతాడు.


అయితే గతంలో రూల్స్ ను పాటించకపోవడం వల్ల అతన్ని బ్యాన్ చేస్తారు. అయితే ఇప్పుడు డబ్బు సంపాదించాలనే ఆలోచనతో… తన పాత స్నేహితుడు “బిగ్” జాన్ ఇలియట్ (స్నూప్ డాగ్) సహాయంతో బడ్ యూనియన్‌లో తిరిగి చేరడానికి అవకాశం పొందుతాడు. కానీ అతను తక్కువ ఆదాయం వచ్చే డే షిఫ్ట్‌లో పని చేయాల్సి వస్తుంది. సెత్ (డేవ్ ఫ్రాంకో) అనే డెస్క్ జాకీ యూనియన్ రిప్రెజెంటేటివ్‌ తో కలిసి వర్క్ చేయడమే అతని పని. బడ్ ఏ రూల్ బ్రేక్ చేసినా రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత మాత్రం సెత్ ‌దే. ఎందుకంటే యూనియన్ బాస్ రాల్ఫ్ సీగర్ (ఎరిక్ లాంగే) బడ్‌ను మళ్లీ బ్యాన్ చేయాలనే ఆలోచనతో ఈ పని చేస్తాడు.

ఈ క్రమంలోనే బడ్ వ్యాంపైర్లు అయిన ఒక వృద్ధ మహిళ, యువకుడిని చంపుతాడు. ఈ హత్యలు ఆడ్రీ సాన్ ఫెర్నాండో (కార్లా సౌజా) అనే పవర్ ఫుల్ వాంపైర్ దృష్లో పడతాయి. ఆమె వాంపైర్లు డేలో కూడా బయటకు రాగలిగేలా చేస్తుంది. ఆడ్రీ సాన్ ఫెర్నాండో వ్యాలీని వాంపైర్ల కోసం ఒక హబ్‌గా మార్చాలని ప్లాన్ చేస్తుంది. ఇందులో ఆమె రియల్ ఎస్టేట్ ద్వారా ఇళ్లను వాంపైర్లకు విక్రయించడం వంటివి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే బడ్, సెత్ కలిసి వాంపైర్ గూడు మీద దాడి చేస్తారు. నజారియన్ బ్రదర్స్ (స్కాట్ ఆడ్కిన్స్, స్టీవ్ హోవీ) అనే లెజెండరీ వాంపైర్ హంటర్లతో కలిసి పనిచేస్తారు. ఈ యాక్షన్ సన్నివేశం అదిరిపోతుంది. వెల్లుల్లి గ్రెనేడ్‌లు, మపింగో వుడ్ బుల్లెట్లు వంటి వాంపైర్ హంటింగ్ గాడ్జెట్స్‌ ఈ ఫైట్ లో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. బిగ్ జాన్ తన గ్యాట్లింగ్ గన్‌తో తిరిగి రంగంలోకి ప్రవేశిస్తాడు. ఇది ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌కు దారితీస్తుంది.ఇక చివరగా బడ్ ఆ వ్యాంపైర్ల నుంచి తన కూతురిని కాపాడుకోవడానికి పెద్ద యుద్ధమే చేస్తాడు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్. ఇంతకీ ఆ వ్యాంపైర్ల నుంచి తన కూతురిని హీరో ఎలా కాపాడుకున్నాడు? ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే?

ఈ వ్యాంపైర్ హంటర్ మూవీ పేరు ‘Day Shift’. J.J. పెర్రీ దర్శకత్వంలో తెరకెక్కిన అమెరికన్ యాక్షన్-కామెడీ-హారర్ చిత్రం. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో 2022 ఆగస్టు 12 న రిలీజ్ అయ్యింది. చిత్రంలో జామీ ఫాక్స్, డేవ్ ఫ్రాంకో, స్నూప్ డాగ్, నటాషా లియు బోర్డిజ్జో, మీగన్ గుడ్, కార్లా సౌజా, స్టీవ్ హోవీ, స్కాట్ ఆడ్కిన్స్, జియాన్ బ్రాడ్‌నాక్స్ తదితరులు నటించారు. ఈ సినిమాలో యాక్షన్ అడ్వెంచర్ మాత్రమే కాదు కామెడీ కూడా కావలసినంత ఉంటుంది.

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×