Actor Chiranjeevi: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో ఇంటర్నేషనల్ లీగ్ టి-20 మ్యాచ్ లు ఆసక్తికరంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ లీగ్ లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ( megastar Chiranjeevi) తలుక్కున మెరిశారు. షార్జా స్టేడియంలో దుబాయ్ క్యాపిటల్స్ – షార్జా వారియర్స్ జట్ల మధ్య శుక్రవారం రాత్రి ( జనవరి 17) జరిగిన మ్యాచ్ ని మెగాస్టార్ చిరంజీవి.. ఐసీసీ డైరెక్టర్ ముబాషిర్ ఉస్మాని, జిఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంధి తో కలిసి ఈ మ్యాచ్ ని తిలకించారు చిరంజీవి.
Also Read: Harbhajan Singh: మొగుళ్లు తప్పు చేస్తే.. పెళ్లాలకు రూల్స్ ఎందుకు ? బీసీసీఐపై భజ్జీ ఫైర్ !
వీరు మ్యాచ్ చూస్తున్న వీడియోని ఇంటర్నేషనల్ లీగ్ టి-20 తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దుబాయ్ క్యాపిటల్ బ్యాటర్లలో షై హోప్ (83*), రోవ్ మెన్ పావెల్ (28), సికిందర్ రజా (27), బ్రాండన్ మెక్కలన్ (22) పరుగులతో రాణించారు. షార్జా బౌలర్లలో టీమ్ సౌథి 2 వికెట్లు పడగొట్టగా.. మిల్లె, ఆదిల్ రషీద్, కరీమ్ తలో వికెట్ సాధించారు.
అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన షార్జా టీమ్ 18.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షార్జా బ్యాటర్ అవిష్కా ఫెర్నాండో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 81 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ తో జట్టును గట్టెక్కించాడు. ఇక దుబాయ్ క్యాపిటల్స్ బౌలర్లలో దుష్మంత చమీరా ఒక్కడే మూడు వికెట్లు తీసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. అసలు విషయం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి ఈ మ్యాచ్ చూసేందుకు షార్జా వెళ్లలేదట.
చిరంజీవి ఒక సినీ పరిశ్రమలోనే కాకుండా వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టిన గొప్ప వ్యాపారవేత్తగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్రాపర్టీలలో పెట్టుబడులు పెట్టారు చిరంజీవి. అలాగే ఊటీలో కూడా ఓ విలాసవంతమైన స్థలాన్ని కొనుగోలు చేశారు. అలాగే పలు రంగాలలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టిన చిరంజీవి దృష్టి ఇప్పుడు క్రికెట్ పై పడిందట.
చిరు క్రికెట్ లో పెట్టుబడులు పెట్టబోతున్నారని సమాచారం. అయితే ఈ విషయాన్ని ఓ అపరా చాణక్యుడుతో చర్చించారట. ఆయన ఎవరో కాదు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాని, జిఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంధి. ఈయన గురించి మీకు తెలిసే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఐపీఎల్ వేలంలో తనదైన టాలెంట్ తో కీలక ఆటగాళ్లను తక్కువ ధరకే సొంతం చేసుకుంటూ ఉంటాడు.
Also Read: Women’s U 19 T20 World Cup: నేటి నుంచి U19 మహిళల టీ20 WC.. టైమింగ్స్, స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
ఈ మాస్టర్ మైండ్ తనకు పోటీగా వచ్చిన వేరే ఫ్రాంచైజీల ఓనర్లను ట్రాప్ లో పడేసి, బిడ్ ని భారీగా పెంచుతూ హైలెట్ గా నిలుస్తుంటాడు. అయితే షార్జా స్టేడియంలో క్రికెట్ లో పెట్టుబడులు పెట్టే అంశంపై చిరంజీవి ఈయనతో చర్చించారట. ఈ ఏడాది జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ టి-20 లో చిరు పెట్టుబడులు పెట్టబోతున్నారని సమాచారం.
MEGASTAR CHIRANJEEVI IN ILT20. 👌 pic.twitter.com/KXJ4ubykDQ
— Johns. (@CricCrazyJohns) January 17, 2025