Manchu Family Issues: మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీను శాసిస్తున్న పేరు ఇది. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల కారణంగా దాదాపు 10 ఏళ్ల పాటు గ్యాప్ ఇచ్చిన కూడా ఆయన ఇమేజ్ చెక్కుచెదరలేదు. బాస్ రియంట్రీ తో రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇన్ని దశాబ్దాలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా గౌరవంతో కొనసాగుతున్నారు అంటే కారణం దానికి మెగాస్టార్ చిరంజీవి ఆఫ్లైన్ బిహేవియర్ కూడా అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవిని చూసి ఇన్స్పైర్ అయి వచ్చిన చాలామంది నటులు మరియు దర్శకులు కూడా ఉన్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి యంగ్ దర్శకులతో పనిచేయడం మొదలుపెట్టారు. ఒకప్పుడు మెగాస్టార్ కు పోటీ ఇచ్చినవాళ్లు ఇప్పుడు మెగాస్టార్ దరిదాపుల్లో కూడా లేరు. ఇక ప్రస్తుతానికి మెగాస్టార్ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే దీనికి మోహన్ బాబు వివాదమే కారణం.
ప్రస్తుతం మంచి ఫ్యామిలీలో జరుగుతున్న ఆస్తి తగాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత రెండు రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ గా మారింది. పోనీ వీటన్నిటిని మా అసోసియేషన్ క్లియర్ చేస్తుంది అనుకుంటే. ఆ అధ్యక్షత పదవి కూడా ఆ కుటుంబంలోనే ఉంది. ఆ కుటుంబానికి ఇప్పుడు సమస్య ఎదురయింది. తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం కూడా జరిగింది. అయితే మోహన్ బాబు అటువంటి దాడేమీ జరగలేదు కానీ జర్నలిస్టు సోదరులు కేవలం అలా రాస్తున్నారు అంటూ ఆడియోలో కూడా క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే మోహన్ బాబు చాలా సందర్భాలలో స్టేజ్ పైన మాట్లాడిన విధానం చాలామందికి నచ్చదు అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి కి అవార్డు ఇస్తున్నప్పుడు కూడా మోహన్ బాబు మాట్లాడిన తీరు అప్పుడు చాలామందికి బాధ కలిగించింది.
Also Read : Mohan babu: ఇండస్ట్రీ పెద్ద నటుడు కదా… యాక్షన్ లోకి దిగాడు
అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న తిక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే హరీష్ శంకర్ కూడా గబ్బర్ సింగ్ అనే సినిమాలో నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది డైలాగ్ రాసాడు. అయితే అప్పుడు మోహన్ బాబు మాటలకు పవన్ కళ్యాణ్ ధీటుగా సమాధానం ఇచ్చాడు. తమ్ముడు మోహన్ బాబు అంటూ మీ మీ క్రమశిక్షణ అంటే నాకు చాలా ఇష్టం అంటూనే సెటైర్లు వేసాడు పవన్ కళ్యాణ్. ఇక ఆన్ స్టేజ్ పై మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం ఏమిటో అప్పట్లోనే చెప్పుకొచ్చాడు. అయితే అప్పుడు మెగాస్టార్ చిరంజీవిని అవమానించడం వలనే నేడు మోహన్ బాబుకి ఇటువంటి పరిస్థితి వచ్చింది అని కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు అని సోషల్ మీడియాలో కొంతమంది మెగా అభిమానులు కామెంట్స్ కూడా చేస్తున్నారు.
Also Read : Manchu Lakshmi: ఇక్కడ ఇంత రచ్చ జరుగుతుంటే.. ఏడున్నావ్ మంచు అక్క.. ?