మూవీ : బరోజ్ త్రీడీ
రిలీజ్ డేట్ : 25 Dec 2024
డైరెక్టర్ : మోహన్ లాల్
నిర్మాత : ఆంటోనీ పెరుంబవూరు
నటీనటులు : మోహన్ లాల్, మాయా రావు వెస్ట్ తో పాటు తదితరులు
బడ్జెట్ : 100 కోట్లు
రన్ టైం : 154 నిమిషాలు
Barroz 3D Movie Rating : 1.5/5
Barroz 3D Movie Review : మోహన్ లాల్ అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తూ ఇక్కడి ఆడియన్స్ ను కూడా పలకరిస్తూ ఉంటాడు. ‘జనతా గ్యారేజ్’ ఇతన్ని తెలుగు ప్రేక్షకులకి దగ్గర చేసింది.అంతకు ముందు ‘మనమంతా’ సినిమా కూడా క్రిటిక్స్ ను మెప్పించింది. ఆ తర్వాత ‘మన్యం పులి’ బాగా ఆడింది. ‘లూసిఫర్’ ‘దృశ్యం’ వంటి సినిమాలను తెలుగులో రీమేక్ చేయడం జరిగింది. ఇక అతని లేటెస్ట్ మూవీ ‘బరోజ్’ తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. దీనికి అతనే డైరెక్షన్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. మరి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
1663 ల నాటి కథ ఇది.పోర్చుగీసు నుండి ఇండియాకి వచ్చి స్థిరపడిన డ గామా అనే రాజ కుటుంబానికి ఎంతో నమ్మకంగా ఉంటాడు బరోజ్(మోహన్ లాల్). అయితే ఒక యుద్దానికి వెళ్తూ అతని భారీ నిధికి కాపలాగా ఉండమని బరోజ్ కి చెబుతాడు ఆ డ గమా రాజు. ’30 రోజుల్లో తిరిగి వస్తాను’ నేను వచ్చే వరకు ఇక్కడే ఉండాలి అంటూ విన్నపించుకుంటాడు. అందుకు ‘సరే.. మీరు వచ్చేవరకు ఇక్కడే కాపలాగా ఉంటాను’ అని మాట ఇస్తాడు బరోజ్. అయితే ఆ రాజు యుద్ధంలో మరణిస్తాడు. మరోపక్క ఆ నిథి కోసం కొందరు దుండగులు అటాక్ చేయగా.. వాళ్ళని హతమార్చి, బరోజ్ కూడా మరణిస్తాడు. అయితే ఆ నిథికి కాపలాగా దాదాపు 400 ఏళ్లపాటు కాపలాగా అక్కడే ఉండిపోతాడు. ఆ తర్వాత ఆ రాజు మనవరాలు ఆ రాజ్యం వద్దకి వస్తుంది. ఆమెకు బరోజ్ ఆత్మ కనిపిస్తుంది? మిగిలిన వారికి కనిపించదు. అది ఎందుకు? ఫైనల్ గా బరోజ్ ఆత్మకి మోక్షం లభించిందా? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో సినిమా మొదలైంది. మోహన్ లాల్ విజువల్ వండర్ గా దీనిని మలచాలని అనుకున్నాడు. పేరుకి అతను దర్శకుడే అయినా.. బరోజ్ కి ఎక్కువగా పనిచేసింది టెక్నికల్ టీం అని చెప్పాలి. దాదాపు 6 ఏళ్ళ పాటు కష్టపడి బరోజ్ ను తెరకెక్కించామని మోహన్ లాల్ చెప్పాడు. అయితే కథ బలంగా ఉన్నప్పుడు, దర్శకుడికి ఓ క్లారిటీ ఉన్నప్పుడు నిర్మాత ఎంత బడ్జెట్ పెట్టినా పర్వాలేదు. కానీ విజువల్స్ కోసమే కథ రాసుకుని ఖర్చు పెట్టించి.. అవి ఆడియన్స్ కనెక్ట్ కాకపోతే ఏం లాభం. బరోజ్ విషయంలో అదే జరిగింది. వాస్తవానికి ఇది చిన్న పిల్లలని ఆకర్షించే కథాంశం. వాళ్ళ కోసం ఫ్యామిలీస్ కదిలి థియేటర్ల వద్దకి వస్తారు. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నప్పుడు ఎమోషన్ కూడా సమపాళ్లలో ఉండాలి. బరోజ్ లో అది పూర్తిగా లోపించింది. ఇంటర్వెల్ వరకు కథపై ఓ క్లారిటీ రాదు. అక్కడ కూడా అటెన్షన్ తో చూసిన వాళ్లకి మాత్రమే ఓ క్లారిటీ వస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. గ్రాఫిక్స్ బాగోలేదు. అందువల్ల సినిమాటోగ్రఫీ కూడా మెప్పించలేదు.
నటీనటుల విషయానికి వస్తే.. మోహన్ లాల్ ఈ సినిమాలో ఓవర్ యాక్షన్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. కామెడీ చేయాలనే కుతూహలం కనిపించినా.. అతను మేనేజ్ చేయలేకపోయాడు. మనవరాలి పాత్ర ఓకే. మిగిలిన నటీనటుల్లో ఎక్కువగా విదేశీయులు ఉండటంతో వాళ్ళ పాత్రలకి మనం కనెక్ట్ కాలేము.
ప్లస్ పాయింట్స్ :
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్ :
డైరెక్షన్
రన్ టైం
మొత్తంగా.. ఎన్నో హాలీవుడ్ సినిమాల స్పూర్తితో రూపొందిన ఈ బరోజ్ చిత్రం.. సరైన ఎమోషనల్ కంటెంట్ లేకపోవడం వల్ల టార్గెటెడ్ ఆడియన్స్ ను కూడా మెప్పించలేకపోయింది అని చెప్పాలి. ఎంతో ఓపిక ఉన్నా.. దీనిని భరించడం కష్టమే.
Barroz 3D Movie Rating : 1.5/5