Nara Lokesh: జగన్ నువ్వు మారవా.. ఐదేళ్లు భ్రష్టు పట్టించావు. విష ప్రచారాలు చేశావు. ఫేక్ ప్రచారాలు కూడా సాగించావు. ఇంకా మారకుంటే ఎలా? ప్లీజ్ ఇప్పటికైనా మారాలి అంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. అది కూడా ఏకంగా మాజీ సీఎం జగన్ కు ట్యాగ్ చేసి ట్వీట్ చేయడం విశేషం.
తిరుపతిలోని అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపీ ధారణ జరిగిందని ప్రచారం ముమ్మరంగా సాగింది. సోషల్ మీడియాలో వీడియో కూడా వైరల్ గా మారింది. అపచారం జరిగిందని, ఎవరో దుండగులు కావాలనే ఈ ఘాతుకానికి పాల్పడారని విమర్శలు వినిపించాయి.
ఈ ఘటనపై వైసీపీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ కూడా చేశారు. తిరుపతిలోని అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీని పెట్టారని, కూటమి పాలనలో బరితెగింపుకు ఇది నిదర్శనమంటూ విమర్శించారు. చంద్రబాబు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సనాతనధర్మ పరిరక్షణ అంటూ కబుర్లు చెప్పే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లే దీనికి పూర్తి బాధ్యత వహించాలని వైసీపీ కోరింది. అది కూడా మాజీ ఎమ్మేల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఈ విషయంపై స్పందించి, ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేశారు.
ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనితో అక్కడి సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇది కావాలని చేశారా, లేక ఎవరైనా మానసిక రోగి చేసిన పనా అనే రీతిలో విచారణ సాగింది. చిట్టచివరకు మానసిక రోగిగా మారిన ఓ బిచ్చగాడు దీనికి కారణమని తేలింది. పోలీసులు విచారించి, ఇది కావాలని చేసిన పని కాదని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వైసీపీ చేసిన విమర్శలపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు.
AlsO Read: AP Students: పది విద్యార్థులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
తన ట్విట్టర్ ఖాతా ద్వారా లోకేష్ స్పందిస్తూ.. జగన్ మీ పరిపాలనలో తిరుమల తిరుపతిని మీరు, మీ గ్యాంగ్ ఐదేళ్లు భ్రష్టు పట్టించినది చాలక.. ఇప్పుడు మళ్లీ విష ప్రచారానికి బరితెగించావు. అన్నమయ్య విగ్రహానికి బిచ్చగాడు శాంటా క్లాస్ టోపీని పెట్టడం సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డయింది.. అయినా తిరుమల, తిరుపతి ప్రతిష్ట మంట కలపాలని ఫేక్ ప్రచారాలు ఆపడం లేదన్నారు. ఇప్పటికైనా మార్పు చెంది, ఇటువంటి విష ప్రచారాలు మానుకోవాలని లోకేష్ హితవు పలికారు. మరి లోకేష్ కామెంట్స్ కి జగన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
.@ysjagan తిరుమల తిరుపతిని నువ్వు, నీ గ్యాంగ్ ఐదేళ్లు భ్రష్టు పట్టించినది చాలక.. ఇప్పుడు మళ్లీ విష ప్రచారానికి బరితెగించావు. అన్నమయ్య విగ్రహానికి బిచ్చగాడు శాంటా క్లాస్ టోపీని పెట్టడం సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డు అయింది.. అయినా తిరుమల, తిరుపతి ప్రతిష్ట మంట కలపాలని ఫేక్… https://t.co/ojAa46gOI0 pic.twitter.com/cXbJjKCHFo
— Lokesh Nara (@naralokesh) December 25, 2024