E-Paper
Advertisement

KTR: సీఎం రేవంత్ రెడ్డికి అసెంబ్లీ వేదికగా కేటీఆర్ సవాల్.. ఇక నువ్వో.. నేనో తేల్చుకుందాం..

KTR: సీఎం రేవంత్ రెడ్డికి అసెంబ్లీ వేదికగా కేటీఆర్ సవాల్.. ఇక నువ్వో.. నేనో తేల్చుకుందాం..
Advertisement

KTR: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా సవాల్ విసిరారు. తన నియోజకవర్గం సిరిసిల్ల లేదా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ కు వెళ్దాం.. ఎక్కడైన వంద శాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తారా..? ఒక వేళ వంద శాతం రుణమాఫీ జరిగినట్లు ప్రూఫ్ అయితే రాజకీయాలే వదిలేస్తా అని కేటీఆర్ సవాల్ విసిరారు.

‘ఎంపీ ఎన్నికల్లో మాకు వచ్చింది గుండు సున్నా. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి వచ్చింది కూడా గుండు సున్నా. ఉద్యోగాలపై అయితే బరితెగించి అబద్ధాలు చెబుతున్నారు. 25 శాఖల్లో కొత్తగా నియామకాలు చేపట్టాం అంటున్నారు. తెలంగాణకు అప్పు పుట్టడం లేదని బయట చెబుతున్నారు. కానీ రూ.1.50 లక్షల కోట్ల అప్పులు చేశామని ఇక్కడ మాట్లాడుతున్నారు. కొత్త టెండర్లకు డబ్బులు ఉన్నాయి కానీ.. ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి డబ్బు లేదా..?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

Advertisement

సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ‘సిరిసిల్ల లేదా కొడంగల్ కు వెళ్దాం. ఎక్కడైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తారా..? ఒకవేళ వంద వాతం రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా. ఎన్నికల ముందు రైతుబంధు ఆపంది కాంగ్రెస్ పార్టీ వాళ్లే. ప్రజలు వీళ్లను గోల్డ్ అనుకున్నారు.. కానీ వీళ్లు రోల్డ్ గోల్డ్. అప్పులపై ప్రభుత్వం చెబుతోంది నిజమా..? కాగ్ చెబుతోంది నిజమా..?’ అని కేటీఆర్ నిలదీశారు.

‘మా ప్రభుత్వం హయాంలో రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు కోర్టు రిమాండ్ విధించింది. ఆయన జైలుకు వెళ్లడంలో అసలు తమకు ఎలాంటి సంబంధం లేదు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి మా కుటుంబాలకు చెందిన వాళ్ల మీద, ఆడవాళ్ల పై, మైనర్ పిల్లలను అని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడలేదా..? అది ఎంత వరకు కరెక్ట్..? ఒక మీ ఇంట్లోనే మహిళలు ఉంటారా..?.. ఇతరుల ఇళ్లలో మహిళలు ఉండరా..? తనకు అప్పట్లో వేరే వాళ్లతో రంకు అంటకట్టారు. అది ఎంత వరకు కరెక్ట్..?’ అని  గతంలో కాంగ్రెస్ నాయకులు చేసిన పలు ఆరోపణలను కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు.

Advertisement

డ్రోన్ లను తమ ఇంటి మీద వదిలేశారని.. ఇది ఎంత వరకు కరెక్ట్ అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏవేవో మాట్లాడుతున్నారని.. ఆయన ఫ్రస్టేషన్ లో ఉన్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం పదవి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్టేషన్ ఉన్న వ్యక్తిని చూడటం ఇదే తొలిసారి చెప్పారు. సీఎం ఇలా మాట్లాడటమే తమకు కావాలని అన్నారు. మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదని చెప్పారు.

ALSO READ: CSIR-CRRI: ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.63,200.. మరి ఆలస్యం ఎందుకు..?

ALSO READ: BANK OF BARODA: భయ్యా ఈ జాబ్ గిట్ల వస్తే జీతం రూ.28,00,000.. డిగ్రీ పాసైతే మీరు అప్లై చేసుకోవచ్చు..

Related News

జీహెచ్ఎంసీలో రెనొవేషన్ దందా కలకలం.. ఆఫీసర్ల మోజుకు కోట్లు ఖర్చు!

నడిరోడ్డుపై డెలివరీ బాయ్స్ నరకం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. క్షణాల్లో ప్రమాదం..!

ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

శామీర్‌పేట్‌లో కాంగ్రెస్ నాయకులు ఫైర్.. BRS ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేయాలని డిమాండ్!

1980s ట్రెండ్.. అచ్చం హీరోలా సీఎం రేవంత్, ఓల్డ్ ఈజ్ గోల్డ్

అదుపు తప్పిన లారీ.. డ్రైవర్‌ సహా 200 గొర్రెలు సజీవదహనం.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం

మూసీ నది ప్రాజెక్టు.. దసరా రోజు నుంచి పనులకు శ్రీకారం, ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

Big Stories

Advertisement
×