MeenaGanesh:సినీ పరిశ్రమల్లో విషాదఛాయలు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఒకరి మరణం అభిమానులను ఇబ్బంది పెడుతుండగా.. మరొకరి మరణం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదిలా ఉండగా నిన్నటికి నిన్న రాత్రి బలగం సినిమాలో ఆఖరి పాట పాడి అందరినీ ఆకట్టుకున్న బలగం కొమరయ్య తుది శ్వాస విడిచారు. అయితే ఆ మరణ వార్త నుంచి ఇంకా అభిమానులు తేరుకోకముందే ఇప్పుడు మరొక మరణ వార్త అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అసలు విషయంలోకెళితే మలయాళీ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. పాపులర్ నటి మీనా గణేష్ (Meena Ganesh) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ఇటీవల ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు.
మీనా గణేష్ నటించిన సినిమాలు..
తన సినీ కెరియర్లో దాదాపు 100కు పైగా సినిమాలు చేసిన ఈమె..ఆ సినిమాలతో విపరీతంగా ఆకట్టుకుంది. ఒక నటిగా తనకంటూ ఇమేజ్ సొంతం చేసుకున్న మీనా గణేష్ సీరియల్స్ లో కూడా నటించింది. అలా దాదాపు 25 సీరియల్స్ లో నటించిన ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు నాటకాలు కూడా వేసే వారు. వాసంతి, నామి, నందనం, మీసా మాధవన్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది మీనా.
మీనా గణేష్ జీవితం..
ఇక ఈమె జీవితం విషయానికి వస్తే.. 1942లో పాలక్కాడ్ లోని కల్లెకులంగరలో జన్మించిన ఈమె.. ఎవరో కాదు మొదటి తరం తమిళ నటుడు కె పీ కేశవన్ కుమార్తె. చదువుకునే సమయంలోనే నాటకాల మీద ఆసక్తి కలగడంతో అటువైపు వెళ్ళింది. అలా కోయంబత్తూరు, ఈరోడ్, సేలం లోని మలయాళీ సంఘాల నాటకాలలో కూడా నటించి మెప్పించింది. 1976లో మణిముజక్కం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన మీనా గణేష్ , 1991లో వచ్చిన ముఖచిత్రం అనే సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆ తర్వాతే సినిమాలలో ఆఫర్లు రావడం జరిగింది.
మీనా గణేష్ వ్యక్తిగత జీవితం..
మీనా గణేష్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఈమె సుప్రసిద్ధ నాటక రచయిత, దర్శకుడు అలాగే నటుడు అయినా ఏ ఎన్ గణేష్ ను 1971లో వివాహం చేస్తున్నారు. వీరిద్దరూ కలసి పౌర్ణమి కళామందిర్ అనే మూ థియేటర్ కమిటీని కూడా ప్రారంభించడం జరిగింది. ఇక ఈమె మలయాళం లో 100కు పైగా చిత్రాలలో నటించింది.. అంతేకాదు ఈమె కెరియర్ లో ఎన్నో చెప్పుకోదగ్గ పాత్రలు కూడా ఉన్నాయి. ఇకపోతే మీనా గణేష్ దంపతులకు కుమారుడు మనోజ్ గణేష్, కూతురు సంగీత ఉన్నారు.ఇక మనోజ్ సీరియల్స్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తూ మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఏదేమైనా ఒకప్పుడు ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న మీనా గణేష్ ఇప్పుడు అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.