BigTV English

Movies: జూన్ 1st నుంచి సినిమాలు బంద్.. హీరోలు ఏమైపోతారో..

Movies: జూన్ 1st నుంచి సినిమాలు బంద్.. హీరోలు ఏమైపోతారో..

Movies: ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావాలంటే అందులో చాలామంది కష్టం ఉంటుంది. కానీ ఎంతమంది ఎంత కష్టపడినా ఆడియన్స్ మాత్రం ముందుగా ఆ సినిమాలో నటించే హీరో ఎవరు అనే చూస్తారు. హీరోకు ఉన్న మార్కెట్ వాల్యూ, ఫ్యాన్ బేస్‌ను బట్టే సినిమా ఎలా ఆడుతుంది అనేది డిసైడ్ అవుతుంది అనేది చాలావరకు నిజమే. కానీ అలా అని సక్సెస్ క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు కొందరు హీరోలు. దాని వల్ల కొందరు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టం జరుగుతోంది. అందుకే వీటన్నింటికి చెక్ పెట్టడానికి మాలీవుడ్ ఇండస్ట్రీ ఒక నిర్ణయానికి వచ్చింది.


మాలీవుడ్‌తో మొదలు

గత కొన్నాళ్లలో మలయాళ ఇండస్ట్రీ ఒక రేంజ్‌లో ముందుకు దూసుకొచ్చింది. ముఖ్యంగా ఫీల్ గుడ్ సినిమాలు తెరకెక్కించడంలో అసలు మాలీవుడ్‌ (Mollywood)ను ఎవరూ బీట్ చేయలేరు అనేలా గుర్తింపు సాధించింది. దీంతో యాక్టర్లు కూడా తమ రెమ్యునరేషన్ విషయంలో కీలక మార్పులు చేశారు. యాక్టర్లు మాత్రమే కాదు.. తెరవెనుక ఉండే డైరెక్టర్లు, ఇతర టెక్నీషియన్లు కూడా పారితోషికాన్ని అమాంతం పెంచేశారు. దీంతో నిర్మాతలై ఒక్కసారిగా అదనపు భారం పడింది. ఇంత ఖర్చు పెట్టిన తర్వాత సినిమా బాగా ఆడితే పర్వాలేదు.. కానీ ఆడకపోతే ఆ భారం నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లపై కూడా పడుతుంది. అందుకే వారంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు.


కలిసికట్టుగా నిర్ణయం

జూన్ 1 నుండి మలయాళ సినీ పరిశ్రమ పూర్తిగా షట్ డౌన్ కానుంది. అప్పటినుండి సినిమా షూటింగ్స్ జరగవు, డిస్ట్రిబ్యూషన్ ఆగిపోతుంది, సినిమాలను ఎగ్జిబిట్ కూడా చేయరు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదు. అయినా కూడా కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ కలిసికట్టుగా ఈ నిర్ణయానికి వచ్చింది. ముఖ్యంగా షూటింగ్ ఆగిపోతే చాలామంది ఇతర టెక్నీషియన్స్‌కు పని దొరకదు. అయినా కూడా రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిన ఇతర టెక్నీషియన్స్‌కు బుద్ధి చెప్పడం కోసం కేరళ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో స్టార్ హీరోలపై కూడా దెబ్బపడనుంది.

Also Read: ’ఇప్పుడు తెలుస్తోంది.. నేను ఓ అహంకారిని’… ఫైనల్‌గా తప్పు ఒప్పుకున్న కంగనా..!

భారీ రెమ్యునరేషన్స్

తెరకెక్కిస్తున్న సినిమాను బట్టి, దాని బడ్జెట్‌ను బట్టి, దానికి వారు అందించే కాల్ షీట్స్‌ను బట్టి.. హీరోలు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంటారు. కానీ గత కొంతకాలంగా పాన్ ఇండియా సినిమాల కల్చర్ పెరిగిపోయింది కాబట్టి.. తర్వాత ఆ మూవీ హిట్ అవుతుందా లేదా అనే ఆలోచన లేకుండా పాన్ ఇండియా ట్యాగ్‌ను అడ్డం పెట్టుకొని కోట్లలో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నారు హీరోలు. మాలీవుడ్‌లో మాత్రమే కాదు.. ప్రతీ ఇండస్ట్రీలో ఇదే పరిస్థితి. అందుకే నిర్మాతలు తమపై పడుతున్న రెమ్యునరేషన్ల భారం గురించి ఎప్పటికప్పుడు అందరితో పంచుకుంటున్నారు. అయినా కూడా పద్ధతి మారకపోతే మాలీవుడ్ మేకర్స్ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని ఇండస్ట్రీ నిపుణులు చాలామంది వారికి సపోర్ట్ అందిస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×