BigTV English

Delhi Liquor Scam: ‘లిక్కర్’ దెబ్బకు హస్తిన విలవిల.. అసలు ఢిల్లీకి, మన గల్లీకి లింకేమిటి?

Delhi Liquor Scam: ‘లిక్కర్’ దెబ్బకు హస్తిన విలవిల.. అసలు ఢిల్లీకి, మన గల్లీకి లింకేమిటి?

Delhi Liquor Scam: ఇప్పటివరకు దేశంలో పెను సంచలనం సృష్టించిన పలు కుంభకోణాల్లో “ఢిల్లీ మద్యం కుంభకోణం” ఒకటి. అసలేంటి ఈ లిక్కర్ స్కామ్ ? ఈ కుంభకోణంలో ఎలాంటి అవకతవకలు జరిగాయి ? ఈ కేసులో ఇప్పటివరకు ఎంతమంది అరెస్ట్ అయ్యారు ? ఎన్నికలపై ఈ లిక్కర్ స్కామ్ ప్రభావం ఎంతవరకు పడింది ? అనే విషయాలను ఒకసారి తెలుసుకుందాం.


పూర్తిగా ప్రైవేట్‌కు అప్పగించిన ఆప్ ప్రభుత్వం

2021 లో కేజ్రీవాల్ ప్రభుత్వం ఒక కొత్త లిక్కర్ పాలసీని తీసుకువచ్చింది. ఢిల్లీలో అప్పటివరకు 60 శాతం మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలో మిగిలిన 40 శాతం ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచేవి. 2021 కొత్త మద్యం పాలసీ ప్రకారం వాటిని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు ఆప్ ప్రభుత్వం అప్పగించింది. ఢిల్లీని మొత్తం 32 జోన్లుగా విభజించి పెద్ద సంఖ్యలో షాపులు పెట్టుకునేందుకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. దీంతో కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఇందుకు లైసెన్స్ ఫీజును కూడా కేజ్రీవాల్ ప్రభుత్వం భారీగా పెంచింది. దీంతో ప్రభుత్వానికి అదనంగా రూ.9 వేల కోట్ల ఆదాయం వచ్చినట్లు అప్పట్లో ఆప్ ప్రభుత్వం వెల్లడించింది. ఎమ్మార్పీతో సంబంధం లేకుండా తమకు నచ్చిన ధరకు లిక్కర్ అమ్ముకునే వెసులుబాటు, ఉదయం 3 గంటల వరకు షాపులు నడుపుకునేందుకు అనుమతి, లిక్కర్ హోమ్ డెలివరీ, మద్యం అమ్మకాలపై ఆఫర్స్ వంటి స్వేచ్ఛా ప్రైవేటు వ్యాపారస్తులకు ప్రభుత్వం కల్పించింది. ఇంతవరకు భాగానే ఉన్నా అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది.


కొత్త చీఫ్ సెక్రటరీ రాకతో వెలుగులోకి స్కామ్

2022 లో ఢిల్లీకి కొత్త చీఫ్ సెక్రటరీ రాకతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. 2022 ఏప్రిల్ లో నరేష్ కుమార్ సీఎస్ గా నియమితులైన తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీని క్షణ్ణంగా స్టడీ చేసి పాలసీ రూపకల్పనలో మరియు మద్యం దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని అలాగే ప్రైవేట్ వ్యాపారుస్తులకు లబ్ది చేకూరేలా విధానపరమైన మార్పులు చేశారని సీఎస్ ఓ నివేదిక రూపొందించారు. ఓవైపు సీఎస్ నివేదిక రూపొందిస్తున్న సమయంలోనే ఆప్ ప్రభుత్వం మద్యం పాలసీని రద్దు చేస్తునట్లు ప్రకటించింది. అనుకున్నంత ఆదాయం రానందు వల్లే పాలసీని రద్దు చేస్తునట్లు తెలిపింది.

అప్పుడే బయటపడిన కల్వకుంట్ల కవిత పేరు

సీఎస్ సమర్పించిన నివేదికను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోమ్ శాఖ దృష్టికి తీసుకెళ్లగా ఏప్రిల్ 2022 లో ఆ నివేదికను పరిగణలోకి తీసుకొని CBI దర్యాప్తుకు కేంద్ర హోమ్ శాఖ ఆదేశలు జారీ చేసింది. ఆగస్ట్ 2022 లో సీబీఐ ఈ కేసు దర్యాప్తును ప్రారంభించింది. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారంటూ వెస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఆయనతో పాటు మరో బీజేపీ ఎంపీ మంజిందర్ సింగ్ నేరుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ప్రస్తావిస్తూ ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె కీలకంగా ఉన్నారాని ఆరోపించారు.

మనీష్ సిసోడియాతో పాటు 14 మందిపై ఎఫ్ఐఆర్

దీంతో రంగంలోకి దిగిన సీబీఐ డిసెంబర్ 11, 2022న హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఆమెను మొదటిసారి సుదీర్ఘంగా విచారించింది. అయితే ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు ఆరోపణలతో ఎంటర్ అయిన ఈడీ.. నాటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసులు నమోదు చేసింది. ఇక 2023 మార్చి 11న మొదటిసారి ఢిల్లీలో కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో కవిత మొత్తం మూడు సార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇకపోతే ఫిబ్రవరి 26, 2023న అప్పటి ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది.

లిక్కర్ మార్కెట్లో 65 శాతం వాటా సౌత్ గ్రూప్ వారే..

ఢిల్లీ లిక్కర్ మార్కెట్ లో ఇండో స్పిరిట్స్ అనే మద్యం కంపెనీ 30 శాతం వాటా కలిగి ఉంది. అయితే ఈ కంపెనీలో 65 శాతం వాటాదారులుగా సౌత్ గ్రూప్ కు చెందిన నలుగురు వ్యక్తులు ఉన్నారు.( కల్వకుంట్ల కవిత, [ హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై ద్వారా కవిత ఇండో స్పిరిట్స్ లో వాటా కలిగి ఉందని ఈడీ చార్జి షీట్ లో పేర్కొంది] , మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులు, అరబిందో ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి)

ఆప్ ప్రభుత్వానికి సౌత్ గ్రూప్ రూ.100 కోట్ల లంచం..

లిక్కర్ పాలసీ అమలుకు ఢిల్లీని 32 జోన్లుగా విభజించి 27 మందికి లైసెన్సులు ఇవ్వగా వాటిల్లో ఏకంగా 9 జోన్లను ఇండో స్పిరిట్స్ కంపెనీ దక్కించుకుందని, అందుకు ఆప్ ప్రభుత్వానికి ఈ సౌత్ గ్రూప్ రూ.100 కోట్లు లంచం ఇచ్చిందని ఈడీ పేర్కొంది. ఆ డబ్బునే గోవా ఎన్నికల్లో వాలంటీర్ ల కోసం ఆప్ ఖర్చు చేసినట్లు ఈడీ తెలిపింది.

5 నెలలకు పైగా తిహార్ జైలులో కవిత

మార్చి 19, 2024న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమె ఐదు నెలలకు పైగా తిహార్ జైల్లో ఉన్నారు. ఆగస్టు 27, 2024న కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదల అయ్యారు. ఆమెతో పాటు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 21,2024 న ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ దాదాపు 156 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. 2024 సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. వీరి ఇద్దరితో పాటు ఈ స్కామ్ తో సంబంధం ఉన్న 13 మంది కీలక వ్యక్తులను ఈడీ అరెస్ట్ చేసింది.

Also Read: CM Revanth Reddy: తెలంగాణలో భారీ బహిరంగ సభ.. రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం..

ఇదిలా ఉంటే ఈ మద్యం కుంభకోణం వల్ల ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో నష్టం జరిగిందా అంటే అవుననే చెప్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ప్రత్యేకించి తెలంగాణలో మాత్రం ఈ లిక్కర్ స్కామ్ తీవ్ర కలకలమే రేపింది.ఇక ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర ఓటమికి మద్యం కుంభకోణమే ప్రధాన కారణం అని పలువురు రాజకీయనేతలు అభిప్రాయపడ్డారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×