BIG TV Exclusive: గత కొన్నేళ్లలో స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలతో కలిసి సీనియర్ హీరోలు మల్టీ స్టారర్ చేస్తే అది కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు. అలా గత కొన్నాళ్లలో వచ్చిన చాలావరకు సినిమాలు కూడా మంచి హిట్‌ను అందుకున్నాయి. అందుకే మెగాస్టార్ చిరంజీవి కూడా అదే రూటు ఫాలో అవ్వనున్నారని తెలుస్తోంది. అంతే కాకుండా మెగా హీరోల నుండే ఒకరిని ఎంచుకొని మల్టీ స్టారర్ చేసే ఆలోచనలో ఉన్నారట చిరు. ఆ మెగా హీరో మరెవరో కాదు.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి దుర్గా తేజ్.
అతిథి పాత్రలో
ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మల్టీ స్టారర్‌లో నటించే అదృష్టాన్ని దక్కించుకున్నాడు సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej). అలాంటిది ఇప్పుడు చిరంజీవి (Chiranjeevi)తో కూడా స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడంతో తన అదృష్టాన్ని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రస్తుతం చిరంజీవి.. యంగ్ డైరెక్టర్ వశిష్టతో కలిసి ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ మూవీలో ఒక అతిథి పాత్ర చేయడానికి యంగ్ హీరోకు స్కోప్ ఉందనే విషయం బయటపడింది. అందుకే ఈ అతిథి పాత్ర చేయడం కోసం మరొక హీరో ఎందుకులే అని సాయి దుర్గా తేజ్‌ను ఎంపిక చేసుకున్నారట మేకర్స్.
షూటింగ్ మొదలు
చాలాకాలంగా ‘విశ్వంభర’ (Vishwambhara) షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ఈ సినిమాలో గెస్ట్ రోల్ గురించి తనను అప్రోచ్ అవ్వగానే సాయి దుర్గా తేజ్ వెంటనే ఓకే చేశాడని, అప్పుడే షూటింగ్‌లో కూడా జాయిన్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మామ, అల్లుడు అయిన చిరు, సాయి దుర్గా తేజ్ మధ్య సీన్స్‌ను చిత్రీకరించడం కూడా మొదలుపెట్టాడట దర్శకుడు వశిష్ట. దీంతో మరోసారి ఇద్దరు మెగా హీరోలను ఒకేసారి స్క్రీన్‌పై చూడడం కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ‘విశ్వంభర’ కోసం అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తుండగా.. అందులో సాయి దుర్గా తేజ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడనే విషయంలో వారిలో మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేస్తోంది.
Also Read: చాలామంది హీరోయిన్స్ నన్ను రిజెక్ట్ చేశారు.. ‘లవ్ టుడే’ హీరో ఆవేదన
కలిసి నటించలేదు
ఇప్పటివరకు మెగా హీరోలు వెండితెరపై కలిసి కనిపించిన సందర్బాలు చాలా తక్కువ. అది కూడా ఇప్పటికీ సీనియర్ మెగా హీరోలు.. యంగ్ మెగా హీరోలతో కలిసి నటించలేదు. అలాంటిది ఆ అదృష్టం సాయి దుర్గా తేజ్‌కు మాత్రమే దక్కింది. ముందుగా పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘బ్రో’ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఈ మెగా మేనల్లుడు. ఎప్పుడో మెగా ఫ్యామిలీ నుండి హీరోలుగా లాంచ్ అయిన వారికే పవన్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రాలేదని, ఆ ఛాన్స్ సాయి దుర్గా తేజ్‌కు వచ్చిందని ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు చిరుతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ రావడంతో వారంతా మరింత హ్యాపీగా ఫీలవుతున్నారు.
మెగా డాటర్ కూడా
‘విశ్వంభర’లో సాయి దుర్గా తేజ్ మాత్రమే కాదు.. మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఒక పాటలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వనుందని సమాచారం. ఇప్పటికే చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహ రెడ్డి’లో నిహారిక చిన్న పాత్రలో కనిపించింది. కానీ ఆ పాత్ర స్క్రీన్‌పై ఎక్కువసేపు ఉండదు. ఇక ఇప్పుడు ‘విశ్వంభర’లో కూడా ఒక పాటలో మెరుపుతీగలా ఇలా వచ్చి అలా వెళ్లిపోనుందట మెగా డాటర్. ఇలా మెగా ఫ్యామిలీలో నటీనటులు ఒకేచోట కనిపిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే అనుకుంటున్నారు నెటిజన్లు.