Mood of Thammudu:యంగ్ హీరో నితిన్ (Nithin) తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూవీ టైటిల్ తమ్ముడు (Thammudu ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వేణు శ్రీరామ్ (Venu Sri Ram) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు (Dilraju) నిర్మిస్తున్నారు. అక్క తమ్ముడు సెంటిమెంట్ తో కమర్షియల్ సినిమాగా రాబోతున్న ఈ సినిమా ద్వారా ప్రముఖ సీనియర్ హీరోయిన్ లయ(Laya) నటిగా రీఎంట్రీ ఇస్తోంది. యంగ్ బ్యూటీ వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి పాత్రలను టీ – సీరీస్ విడుదల చేస్తూ.. ఒక వీడియో రిలీజ్ చేశారు. మరి ఎవరు ఏ పాత్రలో నటిస్తున్నారో ఇప్పుడు చూద్దాం.
లయ పాత్ర పైనే అందరి కళ్ళు..
నితిన్ చివరిగా ‘రాబిన్ హుడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ డిజాస్టర్ ను చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నితిన్ కి ఘోరమైన పరాభవం లభించింది. దీంతో ఎలాగైనా సరే హిట్ కొట్టాలని నితిన్ ఆరాటపడుతున్నారు. అందులో భాగంగానే జూలై 4వ తేదీన ఈ తమ్ముడు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందులో భాగంగానే తాజాగా పాత్రలను రివీల్ చేస్తూ వీడియో విడుదల చేయగా.. అందులో లయా చేయబోయే పాత్ర పైన ఆసక్తి నెలకొంది. సాధారణంగా హీరోయిన్లు రీ ఎంట్రీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. రీ ఎంట్రీ లో బలమైన పాత్ర పడింది అంటే కచ్చితంగా కెరియర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాలో ఏ పాత్రలో నటిస్తోంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
క్యారెక్టర్స్ రివీల్ చేసిన టీ – సిరీస్..
తాజాగా మూడ్ ఆఫ్ తమ్ముడు అంటూ విడుదల చేసిన ఈ వీడియోలో.. శ్రీమతి అనిత ప్రజెంట్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఇందులో సప్తమి గౌడ (Saptami Gouda) ‘రత్న’ అనే పాత్రలో నటిస్తోంది. శ్వాసిక విజయ్ (Swasika Vijay) లేడీ విలన్ కుత్తి పాత్రలో నటిస్తున్నట్లు ఆమె గెటప్ కూడా రివీల్ చేశారు. సౌరబ్ సచ్ దేవ్ (Sourabh Sach dev) మెయిన్ విలన్ గా అగర్వాల్ పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ వర్షా బొల్లమ్మ ‘చిత్ర’ క్యారెక్టర్ లో సింగర్ గా ఈ సినిమాలో నటిస్తోంది. ఇక ఇందులో లయ పవర్ఫుల్ ఆఫీసర్ ‘ఝాన్సీ కిరణ్మయి’ పాత్రలో నటిస్తోంది. ఇందులో ఈమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండనున్నట్లు సమాచారం. అంతేకాదు ఈమె పాత్ర సినిమాకి హైలైట్ గా నిలవనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హీరో నితిన్ ధనుద్దారి గా నటిస్తున్నారు. మొత్తానికైతే భారీ అంజనాల మధ్య జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నితిన్ కు విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.
ALSO READ:NTR New Movie : ఎన్టీఆర్ ఫస్ట్ స్పీచ్.. సేమ్ టూ సేమ్… వంశం గురించి తప్ప ఏం లేదు..