Mowgli: యాంకర్ సుమ గురించి రెండు తెలుగురాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెంట్ ఏదైనా.. స్టార్ ఎవరైనా.. యాంకరింగ్ మాత్రం సుమనే. టాక్ షో కానీ, చితా చాట్ షో కానీ.. ఇంటర్వ్యూ కానీ,ప్రమోషన్స్ కానీ.. ఏది సుమ లేకుండా జరగదు. మూడు షోస్.. ఆరు ఇంటర్వ్యూలతో బిజీగా లైఫ్ గడపుతున్న సుమ .. ఈ మధ్య నటిగా కూడా మారింది. ఇక ఇప్పుడు తన వారసుడిని హీరోగా నిలబెట్టడం కోసం బాగానే కష్టపడుతుంది. సుమ కొడుకు రోషన్ కనకాల. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీకి పరిచయమైన రోషన్.. బబుల్ గమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు సపోర్ట్ దొరికినా ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు.
ఇక బబుల్ గమ్ తరువాత రోషన్.. ఒక వెబ్ సిరీస్ లో నటించాడు. అది అంతగావిజయాన్ని అందుకోలేదు. ఇక అపజయాలను పట్టించుకుంటూ పోతే విజయం ఎప్పుడు దక్కేది. అందుకే హిట్ కొట్టేవరకు వరుస సినిమాలు చేస్తూనే ఉండాలి అన్నట్లు.. రోషన్ కూడా మరో కొత్త సినిమాను ప్రకటించేశాడు. కలర్ ఫోటో సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ రాజ్. ఈ సినిమా తర్వాత దర్శకుడుగా సందీప్ రాజ్ ఇప్పటివరకు ఒక సినిమా కూడా చేయలేదు. ముఖచిత్రం అనే ఒక సినిమాకు మాత్రం కథను అందించాడు. ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు.
ఇక రోషన్ – సందీప్ కాంబోలో మోగ్లీ అనే సినిమా వస్తున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రోషన్ సరసన సాక్షి సాగర్ మడోల్కర్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు ప్రేమికుల రోజును పురస్కరించుకొని.. మోగ్లీ నుంచి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ను మేకర్స్ పంచుకున్నారు.
Siree Lella: మహా కుంభమేళాలో నారా వారి కోడలు.. అస్సలు గుర్తుపట్టలేకుండా ఉందిగా
మోగ్లీ షూటింగ్ మొదలైనట్లు ఒక చిన్న గ్లింప్స్ ద్వారా తెలిపారు. ఈ వీడియోలో సందీప్ రాజ్.. నెమ్మదిగా గన్ ను చెక్కతో తయారుచేసి.. హీరోయిన్ కు విసరడం.. ఆమె ఎవరికో గురిపెట్టి నిలబడితే వెనుక నుంచి రోషన్ వచ్చి ట్రిగ్గర్ నొక్కి బూమ్ అనడంతో షూటింగ్ బిగిన్స్ అని రివీల్ చేశారు. ఇక ఇంకో ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలిపారు. అదేంటంటే.. ఈ సినిమా కోసం 7 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేశారట. అంతేకాకుండా కథ రాయడానికి 8 నెలలు తీసుకున్నారని, 6 మంచి కొత్త టెక్నీషియన్స్.. అందులో కూడా యంగ్ జనరేషన్ వారిని తీసుకున్నట్లు తెలిపారు.
ఇక రోషన్ లుక్ కూడా చాలా బావుంది. న్యూ ఏజ్ లవ్ స్టోరీ అన్నట్లు తెలుస్తోంది. జయం, అహింస సినిమాల్లా అడవిలో ఈ జంట.. ప్రేమ కోసం యుద్ధం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. మరి వీరి ప్రేమకు అడ్డు వచ్చింది మనుషులా.. కులమా.. డబ్బా.. అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది మరి ఈ సినిమాతో రోషన్ ఎలాంటివ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.