BigTV English

Startup claims head transplant system: హెడ్ ట్రాన్స్‌ప్లాంట్.. తొలుత రోబోలతో..

Startup claims head transplant system: హెడ్ ట్రాన్స్‌ప్లాంట్.. తొలుత రోబోలతో..

Startup claims head transplant system: ఒక వ్యక్తి తల మరొకరికి అమర్చడం సాధ్యమేనా? రీల్ లైఫ్‌లో ఈజీ. రియల్ లైఫ్‌లో ఊహించలేనంత కష్టం. హెల్త్ సెక్టార్‌లో అసాధ్యం కాని వాటిని సుసాధ్యం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు.


తాజాగా అమెరికాకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ హెడ్ ట్రాన్స్‌ప్లాంట్‌పై ఓ వీడియోను రిలీజ్ చేసింది. హెడ్ ట్రాన్స్‌ప్లాంట్ ఎలా చేయవచ్చో రోబోలతో చేసిన వీడియోను రిలీజ్ చేసింది. రెండు రోబోలు.. ఒక వ్యక్తి తలను తొలగించి మరొక వ్యక్తికి ఎలా అమర్చాలో చేసి చూపించాయి. అప్పుడే మరణించిన వ్యక్తి తలను తొలగించి.. క్యాన్సర్ -4 స్టేజ్, బ్రెయిన్ డెడ్, అల్జీమర్స్, మార్కిన్సన్స్, పక్షవాతం వంటి వ్యాధులతో ఇబ్బందిపడుతున్న వారికి అమర్చవచ్చన్నది ఆ స్టార్టప్ మాట.

గ్రాఫిక్స్ ఓకే.. రియల్ లైఫ్‌లో సాధ్యమవుతుందా? అనేది బిగ్ క్వశ్చన్. ఈ తరహా ప్రయోగాలు 1900 సంవత్సరం నుంచే మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది పరిశోధకులు ఆ తరహా ప్రయోగాలు చేశారు.. చేస్తున్నారు కూడా. కానీ సక్సెస్ అయినట్టు నిరూపించిన సందర్భాలు లేవు.


ALSO READ: ట్రంప్‌కు సినిమా ఎఫెక్ట్, ఆపై..

అన్నట్లు 1954లో అప్పటి సోవియెట్ యూనియన్ దేశానికి చెందిన ఓ డాక్టర్, ఓ డాగ్‌కు హెడ్ ట్రాన్స్‌ ఫ్లాంట్ చేశారు. అయితే నాడీ వ్యవస్థ, రక్తనాళాలు పని చేయకపోవడంతో కొన్ని నెలలకు ఆ కుక్క చనిపోయింది. ఇప్పటికీ పరిశోధకులు దీనిపై అడుగులు వేస్తూనే ఉన్నారు. కాకపోతే సైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందనేది బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు కాకపోయినా ఏళ్ల తర్వాతైనా సాధ్యం చేయవచ్చని అంటున్నారు. ఒకప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబి, హార్ట్ ఆపరేషన్‌కు అలాగే అన్నారని, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వైద్య నిపుణులు సక్సెస్ చేసి చూపించారని అంటున్నారు సైన్స్ లవర్స్.

Tags

Related News

Musk Vs Ellison: మస్క్ ని మించిన మొనగాడు.. ప్రపంచ నెంబర్-1 కుబేరుడు అతడే

Nepal: నేపాల్‌లో ఇంకా కర్ఫ్యూ.. ఖైదీలపై సైన్యం కాల్పులు, మాజీ ప్రధాని ఇంట్లో నగదు, బంగారం సీజ్?

Donald Trump: ఇజ్రాయెల్, ఖతార్ వార్..! బెడిసికొట్టిన ట్రంప్ డబుల్ గేమ్

Charlie Kirk: అమెరికాలో రాజకీయ హింస.. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్‌ హత్య, నిందితులెవరు?

Pushpa – Trump: ‘పుష్ప’ తరహాలో ఆ దేశానికి ఝలక్ ఇచ్చిన ట్రంప్.. ఇలా తయారయ్యావేంటి మామ!

Nepal Crisis: నేపాల్ ఆర్మీ వార్నింగ్.. విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు, కొత్త ప్రధాని ఆయనే?

Big Stories

×