Pawan Kalyan:నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్. ప్రస్తుతం రెండో సీజన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2 కూడా తొలి సీజన్ స్టైల్లోనే దూసుకెళుతోంది. ఈ షోకి మరింత ఊపు తెచ్చేలా నిర్వాహకులు రెండు ఎపిసోడ్స్ ప్లాన్ చేశారు. అందులో ఒకటి ప్రభాస్ పార్టిసిపేట్ చేయటం. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. కొత్త సంవత్సరం సంద్భంగా డిసెంబర్ 30న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
ఇది కాకుండా మరో క్రేజీ ఎపిసోడ్‌ను ఆహా యాజమాన్యం సిద్ధం చేస్తుంది. అదెవరితోనో కాదు.. బాలయ్య షోలోకి జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడుగు పెట్టటం. ఈ షోపై ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ రేంజ్‌కు చేరకున్నాయి. తాజా సమాచారం మేరకు డిసెంబర్ 27న బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఎపిసోడ్ చిత్రీకరణ జరగనుంది. ఈ ఎపిసోడ్ కోసం ఇటు మెగాస్టార్, పవర్‌స్టార్.. అటు నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగాఎదురు చూస్తున్నారు. ఆఫ్ ది స్క్రీన్ బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలుసుకుని మాట్లాడుకుని ఉండొచ్చు. కానీ తొలిసారి వారు ఆన్ స్క్రీన్ ఆడియెన్స్ ముందు మాట్లాడుకోబోతున్నారు. అసలు పవన్ కళ్యాణ్‌ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు వేస్తారోనని అందరిలోనూ క్యూరియాసిటి పెరిగిపోతుంది.