Poorna Chandar Rao: చాలావరకు మూవీ లవర్స్ అంతా తెలుగులోనే ఉంటారని దేశవ్యాప్తంగా సినీ సెలబ్రిటీలు అంటుంటారు. వారికి కంటెంట్ నచ్చిందంటే చాలు.. భాషతో సంబంధం లేకుండా సినిమాలను హిట్ చేస్తారు. దీనికి ఉదాహరణగా ఎన్నో సినిమాలు ఉన్నాయి. కానీ ఇలాంటి వైవిధ్యభరితమైన కథల్లో కూడా కొన్ని హద్దులు ఉంటాయి. కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడడం, వాటి గురించి ఓపెన్‌గా సినిమా తీయడం అనేది అంత ఈజీ కాదు. కానీ అలాంటి సాహసం చేయడానికి మొదటిసారి మేకర్స్ ముందుకొచ్చారు. ఇండియన్ సినిమాలోనే మొదటిసారి పోర్న్ అడిక్షన్ గురించి ఓపెన్‌గా చెప్పడానికి తెరకెక్కిస్తున్న సినిమానే ‘పూర్ణ చంద్రరావు’.
బోల్డ్ టాపిక్
ఈరోజుల్లో చాలామంది యూత్‌కు ఈ పోర్న్ అడిక్షన్ అనేది ఉంది. కానీ దీని గురించి ఓపెన్‌గా మాట్లాడడానికి కూడా ఎవరూ ఇష్టపడరు. అలాంటిది దాని గురించి ఓపెన్‌గా చెప్పడానికి ఒక సినిమానే వస్తోంది. అదే ‘పూర్ణ చంద్రరావు’. తారక రామ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోగా విజయ్ రాజ్ కుమార్ కనిపించనున్నారు. తను ఇంతకు ముందు ‘ఏం చేస్తున్నావ్’ అనే ఫీల్ గుడ్ సినిమాలో హీరోగా నటించాడు. ఇప్పుడు ‘పూర్ణ చంద్రరావు’ అనే బోల్డ్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో హీరోగా నటించడం మాత్రమే కాకుండా దీనికి రైటర్‌గా కూడా పనిచేశాడు విజయ్ రాజ్ కుమార్.
ఫస్ట్ లుక్‌తో రచ్చ
తాజాగా ‘పూర్ణ చంద్రరావు’ (Poorna Chandar Rao) సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. దీనిని చూస్తుంటేనే ఇది మామూలు సినిమా కాదని అర్థమవుతోంది. సోఫా మీద బట్టలు లేకుండా హీరో కూర్చొని ఉంటాడు. ల్యాప్‌టాప్‌లో ఏదో చూస్తూ ఉంటాడు. ఈ పోస్టర్‌లో హైలెట్‌గా నిలిచింది ఏంటంటే హీరో వెనక గోడపై ఉన్న స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్ ఫోటోలే. ఆ ఫోటోలు అక్కడ ఎందుకు ఉన్నాయి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని అర్థమవుతోంది. ఇక మొత్తానికి ఈ మూవీలో టెక్నాలజీ, పోర్న్ అడిక్షన్, మానసిక స్థితి గురించి మెసేజ్ ఇచ్చేలా ఉన్నారు మేకర్స్. అడల్ట్ కంటెంట్ ప్లస్ సోషల్ మెసేజ్ జోనర్‌లో వచ్చిన ఎన్నో సినిమాలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Also Read: సినీ నటికి ఘోర అవమానం.. ఎయిర్‌పోర్టులో అరుస్తూ అసహనం..
ఎక్స్‌పీరియన్స్‌తో కథ
ఈరోజుల్లో డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్, సోషల్ మీడియా.. ఇలాంటి అడిక్షన్స్ గురించి చాలా సినిమాల్లో చూశాం. సోషల్ మెసేజ్‌కు యూత్‌కు నచ్చేలా చూపిస్తే ఆ సినిమాలు హిట్ అవ్వడం ఖాయం. అలాగే పోర్న్ అడిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా కూడా హిట్ అవుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. పైగా ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రావడం మొదటిసారి కాబట్టి దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి కూడా ఉంటుంది. ‘అనగనగా ఆస్ట్రేలియాలో’ అనే సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయిన తారక రామ.. ఇప్పుడు ఒక బోల్డ్ కంటెంట్‌తో రాబోతున్నారు. ఇక హీరో విజయ్ కూడా తన సొంత ఎక్స్‌పీరియన్స్‌తో ఈ కథను రాశానని బయటపెట్టాడు. ఈ మూవీని సహాన ఆర్ట్ క్రియేషన్స్‌పై మాధవి మంగపతితో పాటు యారీక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.