Naa Anvesh: ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ ఆటగాడా? పోటుగాడా? ఆటగాడైతే కావచ్చు. పోటుగాడు మాత్రం కాదంటున్నారు నెటిజన్స్. ఇలా నా అన్వేష్ లక్ష్యంగా నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తూ, నా అన్వేష్ కు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పుడు నా అన్వేష్ తన మార్క్ ఆన్సర్ ఏమి ఇస్తాడో కానీ, ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది.
బెట్టింగ్ యాప్స్ పై సమరం
బెట్టింగ్ యాప్స్ పై నా అన్వేష్ సమరశంఖం పూరించిన విషయం తెలిసిందే. ఫేక్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ భరతం పట్టిన నా అన్వేష్ కు సోషల్ మీడియా అండగా నిలిచిందనే చెప్పవచ్చు. ఒక్కొక్కరి జాతకాన్ని చదువుతూ, వీరి వల్ల ఎందరో అమాయకులు బెట్టింగ్ బారిన పడి సూసైడ్ చేసుకున్నట్లు అన్వేష్ చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచ యాత్రకు ఫుల్ స్టాప్ పెట్టి మరీ, బెట్టింగ్ యాప్ నిషేధానికి యాత్ర సాగించే రీతిలో వీఐపీలను కూడా వదలకుండా నా అన్వేష్ భరతం పట్టాడు.
లోకల్ బాయ్ నానీతో మొదలై..
వైజాగ్ కు చెందిన లోకల్ బాయ్ నాని బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియో వెలుగులోకి వచ్చిన సమయం నుండి నా అన్వేష్ తన స్పీడ్ పెంచాడు. ఏకంగా సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ను ఇంటర్వ్యూ చేసి మరీ, తన వాణి వినిపించి సజ్జనార్ ప్రశంసలు పొందాడు నా అన్వేష్. ఆ సమయంలో పెళ్లి గురించి నా అన్వేష్ చేసిన కామెంట్స్ పై కాస్త నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఇక ఆ రోజు నుండి భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్, విష్ణుప్రియ, ఇతర సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ పై ఆరోపణలు చేసిన నా అన్వేష్ ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటు అక్కినేని నాగార్జునపై సైతం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు.
ఇరకాటంలో నా అన్వేష్?
హైదరాబాద్ కు చెందిన ఇన్ ఫ్లూయెన్సర్ ఇమ్రాన్ గురించి నా అన్వేష్ చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీసాయి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు ఇమ్రాన్ ను విమర్శించడం వరకు ఓకే గానీ, ఇమ్రాన్ తల్లిని అసభ్యపదజాలంతో దూషించడంపై నెటిజన్స్ ఫైర్ అయ్యారు. అలాగే ఇటీవల నాగార్జున లక్ష్యంగా చేసిన కామెంట్స్ ఒక సంచలనమే. అంతటితో ఆగని నా అన్వేష్ మెట్రో రైలులో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కొరకు కోట్లు చేతులు మారాయని వీడియోను విడుదల చేసి పెను సంచలనమే సృష్టించాడు. ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు ఎత్తిమరీ చెప్పడం, అలాగే సుమారు 300 కోట్లు తీసుకున్నారని ఆరోపించాడు నా అన్వేష్. దీనిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆటగాడివా? పోటుగాడివా?
నా అన్వేష్ ఆటగాడు అనే పదం ఎందుకు వాడుతాడో అందరికీ తెలిసిందే. మిలియన్స్ వ్యూయర్ షిప్ వచ్చే నా అన్వేష్ ఇలాంటి కామెంట్స్ చేయడం, మహిళలను కించపరిచే మాటలతో వివాదాలను తెచ్చుకున్నాడని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయగా, నా అన్వేష్ కు నెగిటివ్ మోడ్ లో గల నెటిజన్స్ నువ్వు ఆటగాడివే, అయితే ఇప్పుడు తెలంగాణ పోలీసుల ముందుకు వచ్చి పోటుగాడివి అని నిరూపించుకో అంటూ సవాల్ విసురుతున్నారు.
Also Read: OTT Movies : ఓటీటీలోకి వచ్చేసిన బెస్ట్ మూవీస్.. ఆ రెండింటిని తప్పక చూడండి..
నోరుంది కదా అని ఎలాగంటే అలా మాట్లాడడం కాదని, దమ్ముంటే ఆధారాలతో రావాలని వారు కోరుతున్నారు. అంతేకాదు ఇటీవల సన్నీ కూడా నా అన్వేష్ ఎంచక్కా మభ్యపెట్టే వీడియోలతో వ్యూస్ సంపాదించుకుంటూ ప్రజలను ఏమారుస్తున్నట్లు తెలిపారు. మరి మొత్తం మీద నెటిజన్స్ మాట మేరకు నా అన్వేష్ తెలంగాణ పోలీసుల ముందుకు వస్తాడా? లేక ఇలాగే మరో వీడియో విడుదల చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. అయితే నా అన్వేష్ తన బెట్టింగ్ నిషేధంపై చేసిన వీడియోల వ్యూస్ డబ్బులను బెట్టింగ్ మహమ్మారి బారి పడి చనిపోయిన యువకుల కుటుంబాలకు అందజేస్తానని చెప్పడం విశేషం.