Sobhita Akkineni: అక్కినేని నాగ చైతన్య- శోభితాల వివాహం డిసెంబర్ 4 న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. తెలుగుదనం ఉట్టిపడేలా అచ్చమైన తెలుగు సంప్రదాయ పద్దతిలో వీరి వివాహం జరిగింది. టాలీవుడ్ నుంచి స్టార్ సెలబ్రిటీలు వీరి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక పెళ్లి తరువాత ఈ జంట మొట్ట మొదటిసారి బయట కనిపించారు. గతరాత్రి జరిగిన ఒక ఈవెంట్ లో చై , శోభితా సందడి చేశారు. బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె పెళ్లిలో జంటగా మెరిశారు.
ఇక చై మొదటి నుంచి కెమెరాల ముందుకు రావడానికి ఎక్కువ ఇష్టపడడు. శోభితా మోడల్ కాబట్టి.. కెమెరా ముందే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈ ఈవెంట్ లో కూడా అదే జరిగింది. జంటగా వీరిద్దరూ కలిసి కనిపించినా.. ఆ తరువాత ఫోటోలకు ఫోజులివ్వకుండా వెళ్ళిపోయాడు. శోభితా కెమెరా ముందు ఫోజులు ఇచ్చి షాక్ ఇచ్చింది. ఇక ఇదంతా పక్కన పెడితే.. అమ్మడి డ్రెస్ పైనే సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.పై నుంచి కిందవరకూ శరీరాన్ని కప్పేసే చుడీదార్ వేసుకొని కనిపించింది. దాని మీద రాయల్ లుక్ కనిపించేలా దుపట్టాను స్టైల్ చేసి.. హెయిర్ ను ముడిపెట్టి కనిపించింది.
Allu Arjun Political Entry : పవన్‌కు పోటీగా అల్లు అర్జున్.. ప్రశాంత్ కిశోర్‌తో భేటీ..?
శోభితా అందాల ఆరబోత గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బికినీ నుంచి మొదలుకొని డ్రెస్ ఏదైనా కూడా అందులో అందాల ఆరబోత లేనిదే అమ్మడు పోస్ట్ చేసేదే కాదు. కానీ, పెళ్లి తరువాత ఆమెలో మార్పు కనిపిస్తుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఎప్పుడైతే చై తో తనకు నిశ్చితార్థం అయ్యిందో.. అప్పటి నుంచి కూడా శోభితా డ్రెసింగ్ స్టైల్ లో మార్పులు వచ్చాయి. పెళ్లి మొత్తంలో ఆమె ఎక్కడా అందాల ఆరబోత చేసినట్లు కనిపించలేదు. నిండుగా.. హుందాగా చీరలతోనే పెళ్లి తంతు ముగించింది.
ఇక పెళ్ళికి ఎవరైనా ఇలానే ఉంటారు. పెళ్లి తరువాత కూడా అందాల ఆరబోతను ఆపేస్తుందేమో చూడాలి అని నెటిజన్స్ మాట్లాడుకున్నారు. ఇక పెళ్లి తరువాత కూడా శోభితా అందాల ఆరబోత చేయదు అని అనిపిస్తుంది. ఇక అందుకు నిదర్శనమే ఈ ఈవెంట్ అని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. చై సైతం సూట్ లో ఎంతో అందంగా కనిపించాడు.
Akshay Kumar : షూటింగ్ స్పాట్ లో ప్రమాదం… అక్షయ్ కుమార్ కు గాయాలు
అక్కినేని కోడలు.. ఇక నుంచి ఇలాగే ఉంటుందా.. లేక మారుతుందా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఇక శోభితానే కాదు.. చైను మొదట పెళ్లాడిన సమంత కూడా ఇలానే పెళ్లి తరువాత గ్లామర్ డోస్ తగ్గించింది. అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టాకా.. హెయిర్ స్టైల్ ఛేంజ్ చేసింది.. గ్లామర్ పాత్రలకు నో చెప్పింది. అందాల ఆరబోత మొత్తానికే ఆపేసింది.
సినిమాలు చేసినా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మాత్రమే ఓకే చెప్పింది. అలా మూడేళ్లు అక్కినేని కోడలిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. విడాకుల తరువాత వాటిని మొత్తాన్ని తుడిచేసింది. ఇక ఇప్పుడు సామ్ లానే శోభితా కూడా అక్కినేని కోడలుగా తన గౌరవాన్ని పెంచుకోవడానికి తన డ్రెసింగ్ స్టైల్ ను మార్చేసినట్లు తెలుస్తోంది. మరి శోభితా పెళ్లి తరువాత సినిమాలు చేస్తుందో లేదో చూడాలి.