BigTV English

Nagachaitanya-sobhita engagement: అఫీషియల్.. ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. నాగార్జున హాట్ కామెంట్స్

Nagachaitanya-sobhita engagement: అఫీషియల్.. ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. నాగార్జున హాట్ కామెంట్స్

Nagachaitanya-Sobhita engagement(Latest news in tollywood):


ఎట్టకేలకు అనుకున్నదే నిజమైంది. అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం వార్తలు నిజమయ్యాయి. తాజాగా ఈ లవ్ కపుల్ ఎంగేజ్‌మెంట్ అఫీషియల్‌గా జరిగింది. ఇవాళ ఉదయం 9:42 గంటలకు శోభిత-చైతన్యలు రింగ్స్ మార్చుకున్నారు. స్టార్ అండ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో అతి కొద్దిమంది సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరికి సంబంధించిన ఎంగేజ్‌మెంట్ ఫొటోలు నాగార్జున తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

రిలేషన్ ఎప్పుడు మొదలైంది


2021లో నాగ చైతన్య – సమంత విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత నుంచే చైతన్య – శోభితా పై రిలేషన్‌ రూమర్స్ తలెత్తాయి. అప్పటి నుంచి చైతన్య, శోభితా వ్యవహారం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తరచూ వీరి రిలేషన్ గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. కానీ వాటిపై చైతూ కానీ, శోభితా కానీ ఎప్పుడూ నోరు విప్పలేదు. అయినా వీరిద్దరి డేటింగ్ రూమర్స్ ఆగలేదు. దీనికి తోడు చైతు, శోభిత కలిసి అప్పుడప్పుడు కెమెరాలకు చిక్కడంతో డేటింగ్ రూమర్స్‌కు మరింత బలం చేకూరినట్లయింది. విదేశాల్లో ఎంజాయ్ చేసిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

Also Read: నాగచైతన్య రిలేషన్‌షిప్‌పై కామెంట్స్.. సమంత రియాక్షన్ ఇదే..

శోభిత ధూళిపాళ్ల కెరీర్

శోభిత ధూళిపాళ్ల 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ఆ తర్వాత అదే ఏడాదిలో మిస్ ఎర్త్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. వాటికి స్వస్తి పలికి సినీ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది. 2016లో సినీ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో రామన్ రాఘవ్ మూవీలో నటించింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్, మంకీ మ్యాన్ సిరీస్‌ల్లో లీడ్ రోల్‌లో నటించి అదరగొట్టేసింది. ఇక తెలుగులో కూడా రెండు సినిమాలు చేసి మంచి గుర్తింపు అందుకుంది. 2018లో అడివి శేష్ నటించిన ‘గూఢాచారి’, 2022లో అదే హీరో నటించిన ‘మేజర్’ సినిమాల్లో కీలక పాత్ర పోషించింది.

అక్కినేని నాగార్జున హాట్ కామెంట్స్

శోభిత, అడివి శేష్ నటించిన ‘గూఢాచారి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ మేరకు శోభితాపై హాట్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. శోభిత సో గుడ్ అని అన్నాడు. అయితే తాను ఇలా మాట్లాడటం తగదు అని అంటూ శోభిత చాలా హాట్ అని అన్నాడు. ఆమెను చూస్తే చెప్పలేని ఎట్రాక్షన్ కనిపిస్తుంది.. ఆమెను చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ నాగార్జున అప్పట్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×