BigTV English

Bandla Ganesh: 29 రాష్ట్రాల్లో బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి.. ఆయ‌న‌ది మిడిల్ క్లాస్ మెంటాలిటీ: బండ్ల గ‌ణేష్

Bandla Ganesh: 29 రాష్ట్రాల్లో బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి.. ఆయ‌న‌ది మిడిల్ క్లాస్ మెంటాలిటీ: బండ్ల గ‌ణేష్

Bandla Ganesh: ఇండియాలోని 29 రాష్ట్రాల్లో బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి అంటూ టాలీవుడ్ నిర్మాత‌, న‌టుడు బండ్ల గ‌ణేష్ ప్ర‌శంస‌లు కురింపించారు. ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో బండ్ల మాట్లాడుతూ… ఆయ‌న‌ది ఈరోజుకు కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ అని చెప్పారు. ముఖ్య‌మంత్రిని అనే అహంభావం అస్స‌లు లేద‌ని అన్నారు. ఇదివ‌ర‌కు ఉన్న సీఎంను క‌ల‌వాలంటే ఎంత క‌ష్టం ఉండేదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. ప‌దేళ్ల‌పాటూ మంత్రుల‌నే క‌ల‌వ‌లేద‌ని చెప్పారు.


Also read: వయనాడ్‌ ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ విజయం.. భారీ మెజారిటీతో రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్

రేవంత్ రెడ్డికి ఉన్న బ్యూటీ వాళ్ల కుటుంబ‌మే అని కొనియాడారు. ఎవర‌ని అయినా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకుని పేరు పెట్టి పిలుస్తార‌ని చెప్పారు. ఇదిలా ఉంటే బండ్ల గ‌ణేష్ నిర్మాత‌గా, న‌టుడుగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. మొద‌ట క‌మిడియ‌న్ గా కెరీర్ ప్రారంభించినప్ప‌టికీ ఆ త‌ర‌వాత నిర్మాత‌గా ఎంట్రీ ఇచ్చారు. తీన్ మార్ సినిమాకు నిర్మాతగా చేయ‌గా ఆ సినిమా న‌ష్టాల‌ను తెచ్చిపెట్టింది. అయిన‌ప్ప‌టికీ వెన‌క‌డుగు వేయ‌కుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ తో గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాను నిర్మించారు.


ఈ సినిమాతోనే బండ్ల‌కు నిర్మాత‌గా గుర్తింపు వ‌చ్చింది. ఆ త‌ర‌వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినప్ప‌టికీ సినిమాలను నిర్మిస్తున్నారు. కేవ‌లం సినిమాలే కాకుండా బండ్ల రాజ‌కీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుండి ఆయ‌న ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. కానీ టికెట్ ద‌క్క‌క‌పోయినా కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగుతూ పార్టీకి సేవ‌లందిస్తున్నారు. ఇక గ‌తంలో చాలా సార్లు త‌న‌కు రేవంత్ రెడ్డి అంటే అభిమానం అని చెప్పగా మ‌రోసారి ఇంట‌ర్వ్యూలో రేవంత్ రెడ్డిపై ప్ర‌శంస‌లు కురిపించారు.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×