BigTV English

Naga Chaitanya : నాగార్జున వీరాభిమానికి మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చిన నాగచైతన్య.. గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్లి మరీ!

Naga Chaitanya : నాగార్జున వీరాభిమానికి మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చిన నాగచైతన్య.. గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్లి మరీ!

Naga Chaitanya : అక్కినేని హీరోలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు నుంచి ఇప్పుడు నాగచైతన్య వరకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ హీరోలు తమ ఫ్యాన్స్ కు ఇచ్చే రెస్పెక్ట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. వాళ్లు కష్టాల్లో ఉన్నారు అంటే తప్పకుండా స్పందిస్తారు. ఇక ఇలా తాజాగా నాగార్జున వీరాభిమానికీ నాగచైతన్య మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చారు.


టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సక్సెస్ మీట్ లో భాగంగా విజయవాడ వెళ్ళిన నాగచైతన్య ఆల్ ఇండియా అక్కినేని నాగార్జున యువసేన అధ్యక్షులు సర్దార్ N నాగేశ్వరరావును ఇంటికి వెళ్లి మరి పరామర్శించారు. నాగార్జునకు వీరాభిమాని అయిన సర్వేశ్వరరావు గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుసుకున్న నాగచైతన్య స్వయంగా ఇంటికి వెళ్లి మరి వారిని ఆప్యాయంగా పలకరించారు. వారితో కాసేపు మాట్లాడారు. ఈ అనుకోని సర్ప్రైజ్ కు ఆ కుటుంబం మొత్తం ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. అంతే కాకుండా నాగచైతన్యను ఎంతో అభిమానంగా పలకరించి ఒకప్పటి సంగతులు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగచైతన్య ఫాన్స్ తో పాటు అక్కినేని ఫ్యాన్స్ అంతా అభిమానులకు ఇచ్చిన విలువకు ఫిదా అయిపోతున్నారు.

నాగచైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన తండ్రి సినిమా అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంటుంది. అద్భుతమైన ప్రేమ కథను ఎంతో అందంగా తెరకెక్కించిన చిత్ర బృందానికి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం విడుదలైన ఈ సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. కొన్ని సన్నివేశాల్లో యాక్టింగ్ కు ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఆయా సన్నివేశాలు చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజే రూ. 21 కోట్లకు పైగా వసూలు సాధించినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. విదేశాల్లో సైతం మూడు లక్షల 50 వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. రెండో రోజు సైతం ప్రపంచ వ్యాప్తంగా రూ. 41.20 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం స్పెషల్ పోస్టర్ ను సైతం రిలీజ్ చేసింది.

లవ్, యాక్షన్, దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్ల జీవితంలో జరిగిన యదార్థగాథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సముద్రం, జాలర్లు పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ల వద్ద అభిమానుల్ని కట్టి పడేస్తుంది.

తండేల్ మూవీ సక్సెస్ తో నాగచైతన్య ఫుల్ ఖుషిగా ఉన్నట్టు తెలుస్తోంది. దర్శకుడు చందు మెుండేటి తెరకెక్కించిన ఈ సినిమాకు అద్భుత రెస్పాన్స్ రావడంతో చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తుంది. చాలా కాలం తర్వాత నాగచైతన్యకు సక్సెస్ రావటంతో అభిమానులు సైతం పండుగ చేసుకుంటున్నారు. సినిమా సక్సెస్ లో భాగంగా చిత్ర బృందం విజయవాడ వెళ్లి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం అభిమాని సర్వేశ్వరరావు ఇంటికి వెళ్లి పలకరించినట్లు తెలుస్తుంది.

ALSO READ : నేను స్టార్ కిడ్ అయ్యింటే కథ వేరేలా ఉండేది.. అదా శర్మ షాకింగ్ కామెంట్స్

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×