Shubman Gill: ఇండియా – ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా నాగపూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో భారత జట్టు మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో 1 – 0 ఆదిక్యంలో ఉంది. ఇక ఇండియా – ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా ఒరిస్సా రాష్ట్రం కటక్ లోని భారాబతి స్టేడియంలో నేడు రెండవ మ్యాచ్ జరుగుతుంది.
Also Read: Nitish Kumar Reddy: తండ్రికి నితీశ్ కుమార్ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో బౌలింగ్ ని టీమిండియా కు అప్పగించాడు. ఇక ఈ మ్యాచ్ ఇరుజట్లకు చాలా కీలకం. సిరీస్ గెలవాలనే ఉద్దేశంతో భారత జట్టు ఈ మ్యాచ్ లోకి దిగగా.. ఇంగ్లాండ్ జట్టు సిరీస్ ని డ్రా చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు భారత్ – ఇంగ్లాండ్ మధ్య 108 వన్డే మ్యాచ్ లు జరగగా.. వీటిలో భారత జట్టు 59 మ్యాచ్లలో విజయం సాధించింది.
ఇంగ్లాండ్ జట్టు 44 మ్యాచ్ లలో విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్లలో ఫలితం రాలేదు. కాగా ఈ రెండవ వన్డేలో స్పిన్ మాంత్రికుడు వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టాడు. అలాగే మొదటి మ్యాచ్ కి దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ.. జట్టులోకి తిరిగి వచ్చాడు. గత మ్యాచ్ తో వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్.. కోహ్లీ కోసం తన స్థానాన్ని త్యాగం చేశాడు. ఇంగ్లాండ్ జట్టు కూడా ఈ మ్యాచ్ కోసం మూడు మార్పులు చేసింది. మార్క్ వుడ్, గస్ అట్కిన్సన్, జేమి ఓవర్టన్ లు తుది జట్టులోకి వచ్చారు.
ఈ రెండవ వన్డేలో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ జట్టు.. 10.5 వద్ద 81 పరుగులు చేసి తొలి వికెట్ ని కోల్పోయింది. 26 పరుగులు చేసిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్ పిలిప్ సాల్ట్ ని వరుణ్ చక్రవర్తి పెవిలియన్ చేర్చాడు. అనంతరం 102 పరుగుల వద్ద బెన్ డకేట్ ని రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. ఇక 163 పరుగుల వద్ద హర్షిత్ రానా బౌలింగ్ లో 29వ ఓవర్ 4 వ బంతిని హ్యరీ బ్రూక్ భారీ షాట్ కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.
Also Read: Ind Vs Eng 2nd Odi: బ్యాటింగ్ చేయనున్న ఇంగ్లండ్..కోహ్లీ, మిస్టరీ స్పిన్నర్ వచ్చేశారు !
అయితే ఈ బాల్ ని భారత యువ ఆటగాడు శుబ్ మన్ గిల్ 20 మీటర్లు పరిగెత్తి మరి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. చిరుతపులిలా డైవ్ చేసి గిల్ అందుకున్న ఈ క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం 44 ఓవర్ల వద్ద ఇంగ్లాండ్ జట్టు 255 పరుగులకు ఐదు వికెట్లను కోల్పోయింది. లివింగ్ స్టోన్ {14*}, జేమి ఓవర్టన్ {5*} క్రీజ్ లో ఉన్నారు.
Partnership broken in style!
An excellent running catch by Vice-captain Shubman Gill 🔥🔥
Follow The Match ▶️ https://t.co/NReW1eEQtF#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/tbtNEu1l0V
— BCCI (@BCCI) February 9, 2025