Premium Tatkal Ticket Booking: నిత్యం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది రైల్వే ప్రయాణం చేస్తుంటారు. చాలా మంది ప్రయాణానికి చాలా రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు. కానీ, కొంత మంది అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటి వారి కోసం భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా ప్రయాణానికి కేవలం ఒక రోజు ముందు టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్లు తీసుకొని హ్యాపీగా జర్నీ చేయవచ్చు. అయితే, ఇప్పటికీ చాలా మందికి తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయాలు, రెంటింటి మధ్య తేడాల గురించి పెద్దగా అవగాహన లేదు. ఈ స్టోరీలో రెండింటి మధ్య తేడాలు, బుకింగ్ సమయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
తత్కాల్ టికెట్ బుకింగ్ టైమింగ్స్
రైలు బయల్దేరే సమయానికి ఒక్క రోజు ముందు తత్కాల్ టికెట్ బుకింగ్స్ మొదలవుతాయి. సమయం అనేది ప్రయాణం చేసే క్లాస్ మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా AC క్లాస్ లకు తత్కాల్ బుకింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. స్లీపర్ క్లాస్ (నాన్-AC)లకు సంబంధించి తత్కాల్ బుకింగ్ ఉదయం 11 గంటలకు షురూ అవుతుంది. ఒకవేళ మీరు ఏప్రిల్ 20న బయలుదేరాల్సి ఉంటే.. తత్కాల్ బుకింగ్ ఏప్రిల్ 19న ఉదయం 10 గంటలకు AC క్లాసులకు మొదలవుతుంది. ఉదయం 11 గంటల నుంచి స్లీపర్ క్లాసులను బుకింగ్ ప్రారంభం అవుతుంది. తత్కాల్ టిక్కెట్లు IRCTC వెబ్ సైట్, యాప్ తో పాటు రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి. తత్కాల్ టికెట్ బుకింగ్ చేయడానికి వ్యాలీడ్ అయ్యే ID అవసరం ఉంటుంది.
ప్రీమియం తత్కాల్ అంటే ఏంటి?
ప్రీమియం తత్కాల్ అనేది తక్కువ సమయంలో అత్యవసర ప్రయాణ టికెట్లను అందించడానికి ప్రవేశపెట్టబడిన డైనమిక్ ఛార్జీల పథకం. ఈ టికెట్ కు ఎక్కువ ధర ఉంటుంది. ఛార్జీలు సాధారణ తత్కాల్ కంటే అధికంగా ఉంటాయి. డిమాండ్ ను బట్టి ధరల పెరుగుదల ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎయిర్ లైన్ ధరల మాదిరిగా మారుతూ ఉంటాయి.
సాధారణ బుకింగ్ మాదిరిగనే ప్రీమియం తత్కాల్ బుకింగ్!
⦿ AC క్లాస్ లకు ఉదయం 10 గంటలకు
⦿ స్లీపర్ క్లాస్ లకు ఉదయం 11 గంటలకు
ఈ విధానం అన్ని రైళ్లలో ప్రీమియం తత్కాల్ కోటా ఉండదు. సెలెక్టెడ్ రైళ్లు, నిర్దిష్ట మార్గాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సీట్లు కూడా పరిమితంగా ఉంటాయి. ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి.
Read Also: ఈ కార్డ్స్ తో టికెట్స్ కొంటే ఇన్ని లాభాలా? ఈసారి అస్సలు మిస్ కాకండి!
తత్కాల్ బుకింగ్ ద్వారా టికెట్లు పొందడం అనేది అంత ఈజీగా కాదు. చాలా మంది ఈ టికెట్ల కోసం పోటీపడుతారు. వీలైనంత ముందుగానే లాగిన్ అయి ఉండటం వల్ల టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. ఏమాత్రం ఆలస్యం చేసినా టికెట్లు దొరకడం కష్టం అవుతుంది.
Read Also: బుల్లెట్ రైళ్లు ముద్దుపెట్టుకోవడం ఎప్పుడైనా చూశారా? దీనికో కారణం ఉంది!