Disco Shanthi: డిస్కో శాంతి పేరుకి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు సినిమాల్లో ప్రత్యేకమైన పాటల్లో కనిపిస్తూ అందరిని తన అందచందాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. అయితే ఆ మధ్య సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఇంటర్వ్యూ లు ఇస్తూ అప్పటి రోజుల్లో సినిమా ఇండస్ట్రీ గురించి వివరిస్తున్నారు.. తాజాగా అలనాటి తార డిస్కో శాంతి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను బయట పెట్టారు. ఇంతకీ ఆమె ఏం చెప్పారో ఒకసారి తెలుసుకుందాం..
శ్రీహరి వైఫ్ శాంతి..
అమలాపురం, బుల్లోడా నేను బొంబాయి చూడాలా వంటి ఎన్నో సినిమాల్లో నటించింది. అప్పట్లో ఐటమ్ సాంగ్స్ కి జయమలీని, జ్యోతి లక్ష్మి, శాంతి, అనురాధ వీళ్లందరు బాగా ఫేమస్. అయితే శాంతి గారు బంధువైన శ్రీహరి గారిని ప్రేమించి పెళ్ళి చేసుకుని నటనకు గుడ్ బై చెప్పేసారు.. ఆ తర్వాత ఆయన అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. దాంతో ఆమే దాన్ని మర్చిపోలేక పోయింది. రోజు రాత్రుళ్ళు ఏడుస్తూ ఎవరితో మాట్లాడకుండా తన గదిలో ఉంటూ కుమిలిపోయారు. ఉన్న అప్పులు తీర్చేసి, నగలు అన్నింటిని అమ్మేసి పిల్లలిని చదివిస్తున్నట్లు చెప్పిన ఆమె శ్రీహరి చనిపోయిన తర్వాత ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూ లో బయట పెట్టింది.
ఇంటర్వ్యూ కన్నీళ్లు పెట్టుకున్న శాంతి..
శ్రీహరి గారు మరణించిన తరువాత పగలనక రాత్రనక తాగుతూ ఉండిపోయాను. రాత్రంతా ఏడుస్తూ ఎపుడు పడుకునేదాన్నో ఎపుడు లేచేద్దాన్నో అన్నట్లు గా గడిపాను అంటూ శాంతి శ్రీహరి గారి మరణం తరువాత ఆమె పరిస్థితిని వివరించారు. ఆయన చనిపోయాక ఎవరిని కలవకుండా ఇంట్లోనే ఉంటున్న.. ఆ సమయంలో పిల్లలు నా దగ్గరకు వచ్చి అమ్మ నాన్న చనిపోయినప్పుడు ఎవరు రాలేదు. ఇప్పుడు పలకరించడానికి కూడా ఏ బంధువు రాలేదు. నువ్వెలా తాగుతూ ఉంటే నీకు ఏదైనా అయితే మేము ఏం కావాలి.. ఆలోచించు నువ్వు మా గురించి అని కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు నేను అర్థం చేసుకున్నా. ఇంకెప్పుడు తాగను ప్రామిస్ చేయను కానీ ఇంకెప్పుడు తాగను అంటూ చెప్పారట. ఆరోజు శాంతి శ్రీహరి గార్ల పెళ్ళి రోజు కావడం వల్ల తాగారట. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ తాగలేదని పిల్లల కోసం మానేసినట్లు చెప్పారు. అలా ఇప్పుడు శ్రీహరిని వాళ్ళల్లో చూసుకుంటున్నానని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ఇంకా ఎలాంటి విషయాలను పంచుకున్నారు. నిజం చెప్పనవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు.. ఆయన భౌతికంగా దూరం అయ్యారు కానీ ఆయన సినిమాలు మాత్రం మనస్సుళ్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. ఎన్నో సినిమాలు ఆయనకు రియల్ స్తార్ అనే ట్యాగ్ ను అందించాయి.. గొప్ప నటుడు శ్రీహరి. అలాంటి ఆయన మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. ఇండస్ట్రీకి తీరని లోటు అనే చెప్పాలి.