IPL 2025 Retentions: ఐపీఎల్ ( IPL 2025 ) వేలం కన్నా ముందు ఏ ఫ్రాంచైజీ ఎవరిని వదిలేస్తుందని ఎవరికి అంతు చిక్కడం లేదు. అన్ని ఫ్రాంచైజీలు దాదాపు ఇప్పటికే తుది జాబితాను ఫైనల్ చేశాయి. స్టార్ ఆటగాళ్లని వదిలి వేస్తారా ? లేదా ? అట్టి పెట్టుకొని ఉంటారా ? అనేది తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని జట్లు కూడా రిటెన్షన్ జాబితాను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 18వ సీజన్ కోసం ఆరుగురిని అట్టిపెట్టుకునేందుకు బీసీసీఐ ( BCCI) అనుమతిని ఇచ్చింది. ఒకసారి 10 జట్ల రిటెన్షన్ అంచనా లిస్ట్ పరిశీలిస్తే..
కోల్కత్తా నైట్ రైడర్:
శ్రేయస్ అయ్యర్ తో పాటు వరుణ్ చక్రవర్తి, ఆల్ రౌండర్ సునీల్ నరైన్ ( Sunil naraine), ఆండ్రు రస్సేల్ ను కోల్కత్తా నైట్ రైడర్స్ రిటైన్ చేసుకోనున్నట్లుగా తెలుస్తోంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు:
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీ ( Virat Kohli), గ్లెన్ మాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్ ( Siraj ), కెమెరూన్ గ్రీన్ ను రిటైన్ చేసుకోనుంది.
Also Read: IND VS NZ: 3వ టెస్ట్ లో భారీ మార్పులు..టీమిండియా నుంచి ముగ్గురు సీనియర్లు ఔట్ ?
ఢిల్లీ క్యాపిటల్స్:
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అక్షర్ పటేల్, రిషబ్ పంత్ ( Rishabh Pant), కుల్దీప్ యాదవ్, జేక్ ఫ్రెసర్ ను అట్టిపెట్టుకోనుంది.
రాజస్థాన్ రాయల్స్:
సంజు శాంసంన్ ( Sanju samson ), జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ ను రాజస్థాన్ రాయల్స్ వదులుకోవడానికి సిద్ధంగా లేదు.
Also Read: VVS Laxman: టీమిండియాకు కొత్త హెడ్ కోచ్..బీసీసీఐ సంచలనం !
పంజాబ్ కింగ్స్:
అర్షదీప్ సింగ్( Arshadeep singh) , శ్యామ్ కరణ్, శశాంక్ సింగ్ ను పంజాబ్ జట్టు అట్టి పెట్టుకోనుంది.
లక్నో సూపర్ జేయింట్స్:
ఈ సారి ఎలాగైనా కప్పును సాధించాలని కసితో ఉన్న లక్నో సూపర్ జేయింట్స్ ( LSG) టీమ్ లో మార్పులు చేయబోతోంది. గత రెండు సీజన్లుగా ఆటలో అద్భుతాలు సృష్టించిన వారిని మాత్రమే అట్టి పెట్టుకోవాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఐదుగురిని రిటైన్ చేసుకోవాలని నిర్ణయంతో లక్నో సూపర్ జేయింట్స్ యాజమాన్యం భావిస్తోంది. నికోలస్ పూరన్ ను ( Nicolas Porran ) తొలి ప్రాధాన్యంగా, అనంతరం మయాంక్ యాదవ్, రవి బిష్నోయి లను రిటైన్ చేసుకోనుంది. అన్ క్యాప్డ్ ప్లేయర్లుగా ఆకాష్ బదోని, మోసిన్ ఖాన్ లు జట్టులో కొనసాగనున్నారు. ఇక కెప్టెన్ కె ఎల్ రాహుల్ ( KL Rahul ) భవితవ్యంపై జట్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదని టాక్ వినిపిస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్:
ఋతురాజ్ గైక్వాడ్, శివమ్ దుబే, రవీంద్ర జడేజా ( Jadeja), పతిరణను చెన్నై సూపర్ కింగ్స్ అట్టి పెట్టుకోనుంది.
సన్రైజర్స్ హైదరాబాద్:
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిషేక్ శర్మ, క్లాసెన్, ప్యాట్ కమిన్స్ ( Pat cummins), ట్రావిస్ హెడ్ తో పాటు నితిష్ కుమార్ రెడ్డిని కూడా జట్టులో ఉంచుకోనుంది.
ముంబై ఇండియన్స్:
బుమ్రా, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ( Tilak Varma), ఇషాన్ కిషన్ ను ముంబై జట్టు అట్టి పెట్టుకోనుంది.
గుజరాత్ టైటాన్స్:
గుజరాత్ టైటాన్స్ గిల్ ( Gill ), రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, మహమ్మద్ షమీ, డేవిడ్ మిల్లర్, రాహుల్ త్రిపాఠిలను అట్టి పెట్టుకోనుంది. ఈనెల 31 అనంతరం టీమ్ లలో ఎవరిని జట్టులో అట్టిపెట్టుకోనున్నారు, ఎవరిని వదులుకోనున్నారు అనేది అధికారికంగా తెలియనుంది.